Modi Dials Kharge: ఖర్గేకు ప్రధాని మోడీ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
Modi Dials Kharge: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖర్గేను మోడీ పరామర్శించారు.
- By Praveen Aluthuru Published Date - 11:45 PM, Sun - 29 September 24

Modi Dials Kharge: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జమ్మూలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మూడో దశ ఓటింగ్‌కు ముందు కథువాలో వందలాది మంది ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆయన అస్వస్థకు గురయ్యారు. తల తిరగడం మరియు దాదాపు స్పృహ కోల్పోయినట్లు అనిపించింది. అయితే భద్రతా సిబ్బంది మరియు తోటి కాంగ్రెస్ నాయకులు అతడిని పట్టుకుని సాయం చేశారు. నీళ్లు తాగిన తర్వాత ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఖర్గే ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు, చిత్తాపూర్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చాడు. “కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జమ్మూ & కాశ్మీర్‌లోని జస్రోటాలో బహిరంగ సభలో ప్రసంగిస్తున్నప్పుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని సమాచారం ఇచ్చారు. అయితే తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందారని, స్పందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ పెట్టారు.
ఇక జమ్మూలో ప్రసంగిస్తూ అస్వస్థకు గురైన ఖర్గే మళ్ళీ తన ప్రసంగంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ఖర్గే తన కృతనిశ్చయాన్ని వ్యక్తం చేస్తూ తాను చనిపోనని, ప్రధాని నరేంద్ర మోడీని అధికారం నుండి గద్దె దించే వరకు ఉంటానని పేర్కొన్నారు. ఖర్గే ఇంకా మాట్లాడుతూ..నాకు 83 ఏళ్లు. ప్రధాని మోదీని అధికారం నుంచి తప్పించే వరకు నేను బతికే ఉంటానని ఆయన అన్నారు.
జమ్మూలో ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఎన్నడూ ఎన్నికలు నిర్వహించాలని అనుకోలేదని విమర్శించారు ఖర్గే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే ఎన్నికలకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రిమోట్-కంట్రోల్డ్ ప్రభుత్వాన్ని నిర్వహించాలని భావించారని ఫైర్ అయ్యారు ఖర్గే. గత 10 ఏళ్లలో భారత యువతకు ప్రధాని మోదీ ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చినప్పుడు మీకేం చేశారో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఖర్గే.
Also Read: Arvind Kejriwal : తిహార్ జైల్లో టార్చర్ చేశారు : కేజ్రీవాల్