PM Modi : ప్రధాని మోడీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా ?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆస్తులు ఎన్ని ? అనే విషయాన్ని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపి స్తుంటారు.
- By Pasha Published Date - 08:44 AM, Wed - 15 May 24

PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆస్తులు ఎన్ని ? అనే విషయాన్ని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపిస్తుంటారు. తాజాగా మంగళవారం రోజు వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసేందుకు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తిపాస్తుల వివరాలను మోడీ వెల్లడించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం..
- ప్రధాని మోడీ(PM Modi) మొత్తం ఆస్తుల విలువ రూ. 3.02 కోట్లు. ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.2.85 కోట్లు, చేతిలో ఉన్న నగదు రూ.52,920.
- ప్రధాని మోడీకి స్థిరాస్తులు లేవు. సొంత కారు లేదు. భూమి లేదు. ఇల్లు లేదు.
- మార్చి 31 నాటికి ప్రధాని మోడీ వద్ద రూ. 1.73 లక్షల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి.
- ప్రధాని బాండ్స్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు.
- ప్రధాని మోడీకి ఎటువంటి అప్పులు కూడా లేవు.
- ప్రధాని మోడీపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.
- 1978 సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేసినట్లు అఫిడవిట్‌లో ప్రధాని మోడీ ప్రస్తావించారు.
- 2019 ఎన్నికల టైంలో సమర్పించిన అఫిడవిట్‌లో ప్రధాని మోడీ మొత్తం ఆస్తుల విలువ రూ.1.41 కోట్లు. ఇప్పుడవి రూ.3.02 కోట్లకు చేరాయి. అంటే ఆయన ఆస్తి గత ఐదేళ్లలో రెట్టింపు అయింది.
- 2019 అఫిడవిట్‌లో ప్రధాని మోడీ పేరిట రూ. 1.1 కోట్ల విలువైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉందని చూపించారు. అయితే ఆ ఆస్తిలో ప్రధాని మోడీ సహా మరో ముగ్గురికి వాటా ఉండేది. ప్రధాని మోడీ తన వాటాను రెండేళ్ల క్రితమే విరాళంగా ఇచ్చేశారు. దీంతో ఈసారి ఆ ఆస్తిని ఎన్నికల అఫిడవిట్‌లో మోడీ ప్రస్తావించలేదు.
Also Read : Rakhi Sawant: తీవ్ర గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిన రాఖీ సావంత్
ఓవరాల్ గా ప్రధాని మోడీ ఆస్తుల విలువ 3.02 కోట్లు కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆస్తుల విలువ రూ.20 కోట్లు. వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధాని మోడీపై పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఆస్తుల విలువ రూ. 1.31 కోట్లు.