Rakhi Sawant: తీవ్ర గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిన రాఖీ సావంత్
ప్రముఖ బాలీవుడ్ నటి, హాట్ మోడల్ రాఖీ సావంత్ గుండె సంబంధిత సమస్యతో హాస్పిటల్లో చేరింది.
- Author : Pasha
Date : 15-05-2024 - 8:11 IST
Published By : Hashtagu Telugu Desk
Rakhi Sawant : ప్రముఖ బాలీవుడ్ నటి, హాట్ మోడల్ రాఖీ సావంత్ గుండె సంబంధిత సమస్యతో హాస్పిటల్లో చేరింది. ఆమె ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధి ఆమెకు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. దీంతో అసలు విషయం తెలిసొచ్చింది.
We’re now on WhatsApp. Click to Join
వారితో రాఖీ సావంత్(Rakhi Sawant) మాట్లాడుతూ.. ‘‘కోలుకోవడానికి నాకు కొంత టైం పడుతుంది. నన్ను కొన్ని రోజులు వదిలేయండి. రెస్ట్ తీసుకోవాలి ’’ అని చాలా చిన్న గొంతుతో చెప్పారు. మీకేం జరిగింది అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘గుండె సమస్య వచ్చింది. ఇలాంటి టైంలో కాల్స్ మాట్లాడలేను. నాకు కనీసం ఐదారు రోజులు రెస్ట్ కావాలి’’ అని రాఖీ సావంత్ బదులిచ్చారు. మీరు ఏ ఆస్పత్రిలో ఉన్నారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘ నేను ఏ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానో చెప్పలేను. అది నా ప్రైవసీ మ్యాటర్. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి’’ అని రాఖీ తెలిపారు. రాఖీ తల్లి జయభేద క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన 2023 జనవరి 28న చనిపోయారు.
రాఖీ సావంత్ బాలీవుడ్లో ఫుల్ పాపులర్. ఫోటో గ్రాఫర్లతో ఆమె చేసే ఫన్, వారి కెమెరాలకు రకరకాల ఔట్ఫిట్లను ధరించి ఆమె ఇచ్చే పోజులు ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనూ రాఖీ సావంత్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆడియెన్స్‌ను తెగ నవ్వించింది. దీంతో బాగా కనెక్ట్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు రాఖీసావంత్ ఆరోగ్యం బాగా లేదని తెలిసి.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.