Blood Donated : ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రపంచరికార్డు….ఏకంగా అంతమంది అలా..!!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేయడంలో దేశం సరికొత్త రికార్డు సృష్టించింది.
- Author : hashtagu
Date : 18-09-2022 - 7:48 IST
Published By : Hashtagu Telugu Desk
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేయడంలో దేశం సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్క రోజులో 87137 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది కొత్త ప్రపంచ రికార్డు. మునుపటి రికార్డు 2014లో మొత్తం 87,059మంది రక్తదానం చేశారు. సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా న్యూఢిల్లిలోని సప్దర్ జంగ్ ఆసుపత్రిలో శనివారం రక్తదాన శిబిరంలో రక్తందానం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా భారీ స్వచ్చంద రక్తదాన ప్రచారరక్తదాన్ అమృత్ మహోత్సవ్‌ను ప్రారంభించారు. ప్రధాని పుట్టినరోజు సందర్బంగా రక్తదాన అమృత్ మహోత్సవ్‌లో ఇప్పటివరకు 87 వేల మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారన.., ఇది కొత్త ప్రపంచ రికార్డు అని ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
అందరి ఆరోగ్యానికి భరోసా కల్పించేదిశగా మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 నాటికి TBని తొలగించడానికి 9 సెప్టెంబర్ 2022న ప్రధాన మంత్రి TB ముక్త్ భారత్ అభియాన్‌ను ప్రారంభించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 నాటికి TBని తొలగించడానికి 9 సెప్టెంబర్ 2022న ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ను ప్రారంభించారు. రాష్ట్రపతి ఈ చొరవ ఊపందుకుంది. ఇప్పటివరకు సుమారు 13.5 లక్షల మంది TB రోగులు NIKSHA పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. వీరిలో 9.5 లక్షల మంది యాక్టివ్ టిబి రోగులు హర్షం వ్యక్తం చేశారు.
India achieves a new milestone in voluntary blood donation with #RaktdaanAmritMahotsav @PMOIndia @mansukhmandviya @DrBharatippawar @PIB_India @mygovindia @AmritMahotsav @DDNewslive @airnewsalerts pic.twitter.com/sogyOtPLSZ
— Ministry of Health (@MoHFW_INDIA) September 17, 2022