Personal Data: ఆసుపత్రిపై హ్యాకర్ల దాడి .. 1.5 లక్షల మంది డేటా విక్రయం
ఢిల్లీ ఎయిమ్స్‌లో సైబర్ దాడి నుంచి కోలుకునే ప్రక్రియ కొనసాగుతుండగానే తమిళనాడులోని ఓ ఆసుపత్రి హ్యాకర్ల దాడికి గురైంది.
- By Gopichand Published Date - 07:35 PM, Sat - 3 December 22

ఢిల్లీ ఎయిమ్స్‌లో సైబర్ దాడి నుంచి కోలుకునే ప్రక్రియ కొనసాగుతుండగానే తమిళనాడులోని ఓ ఆసుపత్రి హ్యాకర్ల దాడికి గురైంది. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌కు చెందిన 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు ప్రముఖ సైబర్ క్రైమ్ ఫోరమ్‌లో విక్రయించారు. అలాగే డేటాబేస్ విక్రయించడానికి టెలిగ్రామ్ ఛానెల్‌ను ఉపయోగించారు. డేటా ఉల్లంఘనను సైబర్ అటాక్ ఇంటెలిజెన్స్ సంస్థ క్లౌడ్‌సెక్ కనుగొంది.
తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్ ఆసుపత్రికి చెందిన రోగుల డేటాను హ్యాకర్లు సైబర్ క్రైమ్ ఫోరమ్‌లలో విక్రయించినట్లు క్లౌడ్‌సెక్ వెల్లడించింది. 2007-2011 మధ్య ఈ ఆసుపత్రికి వెళ్లిన రోగుల వివరాలను సైబర్ నేరగాళ్లు విక్రయించినట్లు తెలిపింది. ఈ డేటాను 100 డాలర్ల నుంచి 400 డాలర్ల చొప్పున అమ్మినట్లు తెలుస్తోంది.
తొలుత థ్రీ క్యూబ్ ఐటీ ల్యాబ్‌ను హ్యాకర్లు టార్గెట్ చేశారు. ఆ వెండర్ సిస్టమ్స్‌ను తమ అధీనంలోకి తీసుకుని.. అక్కడి నుంచి ఆసుపత్రి డేటాను దొంగలించి ఉంటారు అని క్లౌడ్‌సెక్ కంపెనీకి చెందిన అనలిస్ట్ ఒకరు తెలిపారు. శాంపిల్‌లో ఉన్న ఆరోగ్య సంరక్షణ సంస్థను గుర్తించడానికి డేటాబేస్‌లోని వైద్యుల పేర్లను దాని పరిశోధకులు ఉపయోగించారని, ఆపై తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌లో వైద్యులు పనిచేస్తున్నారని వారు గుర్తించగలిగారని క్లౌడ్‌సెక్ తెలిపింది. క్లౌడ్‌సెక్ డేటా ఉల్లంఘన గురించి ఇప్పుడు వాటాదారులందరికీ తెలియజేసినట్లు తెలిపింది.

Related News

4 Women Killed: తమిళనాడులో విషాదం.. తొక్కిసలాటలో నలుగురు మహిళల మృతి
తమిళనాడులో ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 4 మహిళలు మృతి (4 Women Killed) చెందారు. 12 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తిరుప్పత్తూరు జిల్లాలోని వాణియంబాడి వద్ద జరిగే తైపూసం ఉత్సవం సందర్భంగా ఉచితంగా చీరలు, ధోవతులు పంపిణీ చేయడానికి టోకెన్లు జారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.