Pawan Kalyan : కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ భేటి
ఎర్రచందనం అక్రమ రవాణ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు ఉంటాయి. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా పవన్ ప్రణాళికలు చేస్తున్నారు.
- By Latha Suma Published Date - 01:16 PM, Thu - 8 August 24

Pawan Kalyan: ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ(Karnataka CM Siddaramaiah)తో భేటి అయ్యారు. ఈరోజు ఉదయం బెంగళూరు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…నేరుగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌తో సమావేశం కానున్నారు. వ్యవసాయ భూముల వద్దకు జంతువులు రావడం, పంటలను నాశనం చేయడం.. రైతుల జీవనోపాధికి హాని కలిగించడం వంటి సమస్యలకు పరిష్కార దిశగా ఈ చర్చలుంటాయని తెలుస్తోంది. వన్యప్రాణుల నుండి రైతుల పంటలను కాపాడే ఉద్దేశంతో ఈ సమావేశం జరుగుతుందని సమాచారం.
కుమ్కి ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశపెట్టడంతో పాటు వినూత్న పరిష్కారాలను అన్వేషించాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ చొరవ పర్యావరణ సమతుల్యతను మెరుగుపరచడం, హానికరమైన వన్యప్రాణుల చర్యలను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, మానవ-వన్యప్రాణుల సంఘర్షణ వల్ల ఎదురయ్యే బహుముఖ సవాళ్లను పరిష్కరించడంలో ఈ చర్చలు కీలకమైనవి. ఇందుకు కర్ణాటక మద్దతు అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.
Read Also: Independence Day: ఆగస్టు 15న ప్రముఖంగా సందర్శించే ప్రదేశాలివే..!