Operation Bhediya : ‘ఆపరేషన్ భేడియా’ ఫెయిల్.. మరో చిన్నారిని చంపేసిన తోడేలు
బాధిత కుటుంబాల పరిస్థితిని మనం మాటల్లో చెప్పుకోలేం. దాదాపు 6 తోడేళ్లు ఈ దాడులను చేస్తున్నట్లు తెలుస్తోంది.
- By Pasha Published Date - 03:10 PM, Mon - 2 September 24
Operation Bhediya : మనుషులను పీక్కుతినే తోడేళ్లు చెలరేగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాలో మనుషులపై తోడేళ్ల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి రెండు, మూడు చోట్ల తోడేళ్లు జరిపిన దాడులతో ప్రజలు భయకంపితులు అయ్యారు. ఈ దాడుల్లో ఓ చోట మూడేళ్ల పసికందు చనిపోయింది. మరో చోట తోడేళ్ల దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. దీంతో ఇప్పటివరకు బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడిలో చనిపోయిన వారి సంఖ్య 8కి పెరిగింది. చనిపోయిన వారిలో ఏడుగురు పిల్లలే ఉండటం విషాదకరం. బాధిత కుటుంబాల పరిస్థితిని మనం మాటల్లో చెప్పుకోలేం. దాదాపు 6 తోడేళ్లు ఈ దాడులను చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిలో నాలుగు తోడేళ్లను ఇప్పటికే అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. మిగతా రెండు తోడేళ్లను పట్టుకునేందుకు ఆపరేషన్ భేడియా(Operation Bhediya) పేరుతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
తోడేళ్లను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు వినూత్న పద్ధతులను వాడుతున్నారు. రంగురంగుల టెడ్డీ బొమ్మలను చిన్నారుల మూత్రంతో తడిపి అడవుల్లో తోడేళ్లు తిరిగే ప్రదేశాల్లో వేస్తున్నారు. ఆయా ఏరియాల్లో డెన్లు ఏర్పాటు చేస్తున్నారు. మనిషి మూత్రం వాసనను గుర్తించి.. పరిసరాల్లో మనిషి ఉన్నాడని భావించి తోడేళ్లు వచ్చి బోనులో చిక్కుతాయని అటవీ అధికారులు అంచనావేస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి టెక్నిక్‌లతోనే నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు.
Also Read :Supreme Court : సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. రైతులతో చర్చలకు ప్రత్యేక కమిటీ
సాధారణంగా తోడేళ్లను పట్టుకోవడం ఎందుకంత టఫ్‌గా ఉంటుందంటే… అవి ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మారుస్తుంటాయి. దీంతో వాటిని గుర్తించేందుకు టైం పడుతుంది. థర్మల్ డ్రోన్లతో బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ల కదలికలను అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. కాగా, యూపీలో తోడేళ్ల దాడుల వార్తలు విని పొరుగున ఉన్న బిహార్‌లో ప్రజలు హడలిపోతున్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో ప్రజలు అలర్ట్‌గా ఉంటున్నారు. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి బిహార్‌లోని మక్‌సుద్‌పుర్‌లో తోడేలుగా భావించి నక్కను స్థానికులు కొట్టి చంపారు. ఈవిధంగా మూగజీవాలను, జంతువులను చంపుతుండటంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Related News
Jackals Terror : నక్కను 15 అడుగుల దూరం విసిరి పారేశాడు.. అసలు ఏమైందంటే ?
రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై నక్కలు(Jackals Terror) దాడి చేశాయి.