Pawan Kalyan : వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
. చెన్నైలో జరిగిన ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ పై సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇలాంటి దేశంలో తరచూ ఎన్నికలు నిర్వహించటం వలన పరిపాలనలో అంతరాయం కలుగుతోంది.
- By Latha Suma Published Date - 02:20 PM, Mon - 26 May 25

Pawan Kalyan : దేశ అభివృద్ధి దిశగా సమగ్రంగా ముందుకు సాగాలంటే, ఎన్నికల వ్యవస్థలో పెద్ద మార్పు అవసరమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అనేది నినాదం మాత్రమే కాక, దేశ భవిష్యత్‌ను ప్రభావితం చేసే కీలకమైన అంశమని ఆయన స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ పై సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇలాంటి దేశంలో తరచూ ఎన్నికలు నిర్వహించటం వలన పరిపాలనలో అంతరాయం కలుగుతోంది. ఎన్నికల ఖర్చులు పెరగడం, రాజకీయ అస్థిరత నెలకొనడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకే సారి ఎన్నికలు జరగడం వల్ల పరిపాలన నిరవధికంగా సాగుతుంది, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేస్తుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Read Also: Visakhapatnam : ఇంస్టాగ్రామ్‌లో పరిచయం.. 40 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు..తర్వాత ఏమైందో తెలుసా..?
దేశానికి సమర్థవంతమైన ఎన్నికల విధానం అవసరమని, భారత్‌కు ఉన్న సామర్థ్యం దృష్ట్యా ఇది సాధ్యమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మనసుంటే మార్గం ఉంటుంది. ముందడుగు వేస్తే మార్గంలో వచ్చిన ఆటంకాలను అధిగమించగలం. సాంకేతికంగా, న్యాయపరంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది కానీ, అవి అసాధ్యమవు. ప్రభుత్వ విధానాల్లో సమన్వయం రావాలంటే ఇదే సరైన దిశ అని వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై వస్తున్న విమర్శలపై కూడా పవన్ స్పందించారు. ఈవీఎంలపై ఆరోపణలు నిరాధారమైనవి. 2019 ఎన్నికల్లో అదే ఈవీఎంలతో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అవి తప్పులుగా ఎలా మారుతాయి? ప్రజల తీర్పును గౌరవించాలి. ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని ప్రజల్లో పెంచాల్సిన అవసరం ఉంది అని అన్నారు.
భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ మాదిరి స్పష్టమైన దిశలో నడిపించే నాయకుడు అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి వేగంగా సాగుతోంది. ఆయన్ని అనుసరిస్తూ మేము కూడా రాష్ట్రంలో మార్పు తేనుకే ముందుకు వస్తున్నాం. తమిళనాడులో కూడా బీజేపీ నేతృత్వంలోని కూటమి ఈసారి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం అని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల సంస్కరణలు, ప్రజల ఆలోచనలలో వచ్చే మార్పులపై సమగ్ర చర్చ జరగాలని ఆయన కోరారు. ఇది ఒక దిశగా మొదలైన చర్చ. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇది అవసరమైన చర్చ. భవిష్యత్‌లో ఇది దేశానికి మార్గదర్శక మార్పుగా నిలుస్తుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also: PM Modi : లోకోమోటివ్ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ