Odisha Train Accident: రైలు ప్రమాదం.. కుళ్లిపోతున్న 100కి పైగా మృతదేహాలు
బాలాసోర్ ప్రమాదం తర్వాత సహాయక చర్యలు పూర్తయిన తర్వాత కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ప్రమాదం జరిగిన 36 గంటల తర్వాత పరిపాలన 100 కంటే ఎక్కువ మృతదేహాలను భువనేశ్వర్‌కు పంపింది.
- By Gopichand Published Date - 12:52 PM, Sun - 4 June 23

Odisha Train Accident: బాలాసోర్ ప్రమాదం తర్వాత సహాయక చర్యలు పూర్తయిన తర్వాత కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ప్రమాదం జరిగిన 36 గంటల తర్వాత పరిపాలన 100 కంటే ఎక్కువ మృతదేహాలను భువనేశ్వర్‌కు పంపింది. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌లో ఉంచారు. బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇప్పటివరకు 288 మంది మరణించారు. ఘటనా స్థలం నుంచి సహాయక చర్యలు పూర్తి చేశారు. 1175 మంది ఆసుపత్రిలో చేరగా.. వారిలో 382 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. 793 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాల నిర్వహణకు సంబంధించి సమస్య నెలకొంది. 100కు పైగా మృతదేహాలు ఉన్నాయి. వాటిని సేకరించడానికి ఎవరూ రాలేదు.
మృతదేహాలకు ఫోరెన్సిక్ పరీక్షలు
ఈ మృతదేహాలను నుషి అనే ప్రదేశంలో ఉంచారు. కానీ ఇక్కడ అవి దుర్వాసన రావడం ప్రారంభించాయి. ఆ తర్వాత అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు. ఈ మృతదేహాలను గుర్తించడం పరిపాలనకు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. ఈ సమయంలో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌లో గుర్తుతెలియని మృతదేహాలను పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: Indian Railways: ప్రతి ఏడాది పట్టాలు తప్పుతున్న 282 రైళ్లు.. కాగ్ నివేదికలో కీలక విషయాలు..!
మృతదేహాలను పాఠశాలలో ఉంచారు
బహ్నాగా హైస్కూల్ సంఘటనా స్థలానికి కొంత దూరంలో ఉంది. ఇక్కడ ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను పెద్దఎత్తున తీసుకొచ్చారు. మృతదేహాలను పాఠశాలలో ఉంచారు. ఈ స్థలం సంఘటనా స్థలానికి సమీపంలో ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఇంత పెద్ద సంఖ్యలో మృతదేహాలను ఉంచడానికి తగినంత స్థలం ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు 163 మృతదేహాలు ఇక్కడకు చేరుకున్నాయి. వీరిలో దాదాపు 30 మందిని వారి బంధువులు గుర్తించారు.
పాఠశాలలో 100 మందికి పైగా మృతదేహాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. వీరిలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో రాజేంద్ర కూడా ఒకరు. ఛిద్రమైన మృతదేహాలను ఎత్తడం చాలా కష్టమైన పని అని, అయితే వారి బంధువుల రోదనలను చూడటం మరింత బాధాకరం అని ఆయన అన్నారు. కొన్ని మృతదేహాలు అనేక ముక్కలుగా కట్ కాగా.. కొన్నింటికి విద్యుత్ షాక్‌లు తగిలాయి. వాటిని గుర్తించడం చాల కష్టం మారిపోయింది.