Rahul Gandhi : AI పై మాటాలే కాదు..బలమైన పునాది అవసరం : రాహుల్ గాంధీ
మన పోటీ దేశాలు మాత్రం కొత్త సాంకేతికతను సృష్టించి రాటుదేలుతున్నాయి. సాంకేతికతను రూపొందించడానికి మనకు ఒక బలమైన పునాది కావాలి. వట్టి మాటలు కాదు అని రాహుల్ విమర్శించారు.
- By Latha Suma Published Date - 03:43 PM, Sat - 15 February 25

Rahul Gandhi : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. కృత్రిమ మేధ (AI) సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడంలో ప్రధాని మోడీ విఫలమవుతున్నారని అన్నారు. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు, ఆయన డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక వీడియోను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు.
Drones have revolutionised warfare, combining batteries, motors and optics to manoeuver and communicate on the battlefield in unprecedented ways. But drones are not just one technology – they are bottom-up innovations produced by a strong industrial system.
Unfortunately, PM… pic.twitter.com/giEFLSJxxv
— Rahul Gandhi (@RahulGandhi) February 15, 2025
Read Also:Rohit Sharma: దుబాయ్‌లో హిట్ మ్యాన్ రాణిస్తాడా? గణంకాలు ఏం చెబుతున్నాయి?
డ్రోన్‌లు యుద్ధరంగంలో విప్లవాత్మక మార్పులు చేశాయి. బ్యాటరీలు, మోటార్లు, ఆప్టికల్‌లు జత చేయడంతో యుద్ధభూమిలో కమ్యూనికేట్ అవుతున్నాయి. అయితే, ఇది కేవలం ఒక సాంకేతికత కాదు. బలమైన పారిశ్రామిక వ్యవస్థతో ఉత్పత్తి చేసిన ఆవిష్కరణలు. దురదృష్టవశాత్తూ ప్రధాని మోడీ ఈ విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యారు. ఆయన ఏఐపై టెలీప్రాంప్టర్‌లో ప్రసంగాలు చేసుకుంటూ ఉంటే.. మన పోటీ దేశాలు మాత్రం కొత్త సాంకేతికతను సృష్టించి రాటుదేలుతున్నాయి. సాంకేతికతను రూపొందించడానికి మనకు ఒక బలమైన పునాది కావాలి. వట్టి మాటలు కాదు అని రాహుల్ విమర్శించారు.
దేశంలో గొప్ప ఇంజినీరింగ్ మేధస్సు ఉన్నప్పటికీ, అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో వెనుకబడి పోతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి వేగాన్ని ప్రస్తావించిన రాహుల్, భారతదేశం కూడా స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కేవలం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మాత్రమే కాకుండా, దేశాన్ని టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఒక గట్టి పారిశ్రామిక వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మోడీ.. ఏఐ యాక్షన్ సమ్మిట్ కు అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి అధ్యక్షత వహించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ (AI)తో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలను కొట్టిపారేశారు.
Read Also: AP Police : వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు