Pension : పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు పెన్షన్ నిలిపివేత..!
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ సదుపాయాన్ని నిలిపి వేయనుంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ నిబంధన వర్తిస్తుంది.
- By Latha Suma Published Date - 08:13 PM, Wed - 4 September 24
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని నిలిపి వేయనుంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన బిల్లుపై చర్చ అనంతరం రాష్ట్ర అసెంబ్లీ బుధవారం నాడు ఆమోదించింది.
We’re now on WhatsApp. Click to Join.
హిమచల్ ప్రదేశ్ శాసనసభ (సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు) సవరణ బిల్లు-2024ను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఏదైనా ఒక సమయంలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఇక నుంచి పెన్షన్ పొందే వీలుండదని బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అనంతరం సీఎం మాట్లాడుతూ, కొందరు (ఎమ్మెల్యేలు) రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి పద్ధతులకు పాల్పడుతుంటారనీ, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి ఈ బిల్లు చాలా అవసరమని చెప్పారు. హిమాచల్ ప్రభుత్వం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించినట్టు తెలిపారు.
#WATCH | On the new anti-defection bill passed by Himachal Pradesh Assembly, CM Sukhvinder Singh Sukhu says, "…They want to gain political benefits through such corrupt practices. This Bill was essential to be introduced to strengthen democracy. Our Assembly passed it today… pic.twitter.com/O2HlKnkaqV
— ANI (@ANI) September 4, 2024
దీనికి ముందు ఫిబ్రవరి 29న ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేశారు. వీరిపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 34కు పడిపోయింది. అయితే ఆ తర్వాత విధానసభ ఉప ఎన్నికల్లో తిరిగి 40 స్థానాలకు కాంగ్రెస్ చేరుకుంది. విపక్ష బీజేపీకి అసెంబ్లీలో 28 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
Read Also: CM Chandrababu : వరద ప్రాంతాల్లో నాలుగో రోజు సీఎం చంద్రబాబు పర్యటన
Related News
Pensions : పెన్షన్ దారులకు షాక్ ఇవ్వబోతున్న చంద్రబాబు సర్కార్
ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని నీరుగార్చుతూ.. కొంతమంది అక్రమార్కులు.. పెన్షన్ పొందుతుంటారు. వారికి అర్హత లేకపోయినా తాము దివ్యాంగులం అని చెప్పుకుంటూ.. వారు లబ్ది పొందుతున్నారు.