Political Campaign: రాజకీయ ప్రచారాల్లో పిల్లలను ఉపయోగించుకోకూడదు: ఎలక్షన్ కమిషన్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 18 ఏళ్లలోపు చిన్నారులు పాల్గొనడాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. తమ ప్రచారాల్లో భాగంగా పిల్లలను ఉపయోగించుకోవడం మానుకోవాలని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది.
- By Praveen Aluthuru Published Date - 01:54 PM, Mon - 5 February 24

Political Campaign: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 18 ఏళ్లలోపు చిన్నారులు పాల్గొనడాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. తమ ప్రచారాల్లో భాగంగా పిల్లలను ఉపయోగించుకోవడం మానుకోవాలని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది.
త్వరలోనే లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఆయా రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలు శరవేగంగా నిర్వహిస్తాయి. తమ పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొందరు నాయకులు పిల్లలని ప్రచారంలో చేర్చుకుంటున్నారు. 18 ఏళ్ళ లోపు పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయిస్తూ లబ్ది పొందుతున్నారు. దీంతో పిల్లల ఆలోచన విధానాల్లో మార్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. బంగారు భవిష్యత్తున్న చిన్నారులు రాజకీయ సునామీలో కొట్టుకోకుండా అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి. చిన్న నాటి నుండి వారిలో లేనిపోని నెగటివ్ ఎనర్జీని సృష్టించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
2024 పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ దూకుడు పెంచాయి. అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ఎన్నికల సంఘం తాజాగా నిర్ణయం తీసుకుంది. తమ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా పిల్లలను వాడుకోవడం మానుకోవాలని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది.
Also Read: TS Change TG : అందుకోసమే టీఎస్‌ను టీజీగా మార్చాల్సి వచ్చింది – రేవంత్‌రెడ్డి వివరణ