HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Nine Terror Camps Destroyed Rajnath Singh

Rajnath Singh in Lok Sabha : తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం – రాజనాథ్ సింగ్

Rajnath Singh in Lok Sabha : మే 6, 7 తేదీలలో జరిగిన ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు మృతిచెందినట్లు వెల్లడించారు

  • Author : Sudheer Date : 28-07-2025 - 3:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lok Sabha Operation Sindoor
Lok Sabha Operation Sindoor

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) ద్వారా పాక్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Rajnath Singh) లోక్‌సభలో ప్రకటించారు. మే 6, 7 తేదీలలో జరిగిన ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు మృతిచెందినట్లు వెల్లడించారు. ఈ ఉగ్రవాదులు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి పాక్ మద్దతు ఉన్న సంస్థలకు చెందినవారని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టబడిందని మంత్రి పేర్కొన్నారు. “ఈ దాడుల కోసం భారత సైన్యం పూర్తి స్థాయిలో ముందస్తు పరిశీలనలు జరిపింది. ఉగ్రవాదులపై గరిష్టంగా ప్రభావం చూపేలా ప్లాన్ చేసి, పౌరులపై ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకున్నారు” అని రాజనాథ్ సింగ్ వివరించారు.

Trump : డప్పుకొట్టుకోవడం ఆపని ట్రంప్.. మరో యుద్ధాన్ని ఆపేశానంటూ వ్యాఖ్యలు..

“ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య మాత్రమే కాదు, అది భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకున్న గట్టి ధోరణి యొక్క స్పష్టమైన ఉదాహరణ” అని పేర్కొన్నారు. ఈ చర్య భారత సార్వభౌమాధికారానికి, దేశపు ప్రజల భద్రతకు, మన సైనికుల కట్టుబాటుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

“మన సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. పహల్గామ్ దాడి తర్వాత వారు తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతం మరియు సూత్రబద్ధమైనది” అని మంత్రి కొనియాడారు. ప్రస్తుత మాన్సూన్ సెషన్‌లో ఈ ఆపరేషన్‌పై లోక్‌సభ చర్చకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఆందోళనల మధ్య సభ మూడుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

కొంతమంది ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలపై సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. “మన వాయుసేనకు చెందిన విమానాలు ఎన్ని పడిపోయాయో అని వారు అడుగుతున్నారు. కానీ ఇది జాతీయ భావోద్వేగాలకు సరిపడే ప్రశ్న కాదని నేను భావిస్తున్నాను” అని ఆయన వ్యాఖ్యానించారు. మన సైన్యం ఎంతమంది శత్రు విమానాలను కూల్చారో అడగడం గానీ, ఉగ్ర స్థావరాలపై మన దాడులు ఎంత సక్సెస్ అయ్యాయో చెప్పని అని ప్రశ్నిస్తే బాగుంటుంది. ” మనం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామా? అంటే స్పష్టంగా అవును. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందా? సమాధానం అవును. ఉగ్రవాద నేతలు హతమయ్యారా? అవును. మన జవాన్లకు ఎలాంటి హాని జరిగింది? అంటే లేదు. మన జవాన్లకు ఎలాంటి నష్టం కలగలేదు అని క్లారిటీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lok sabha
  • Operation Sindoor
  • Parliament Monsoon Session
  • Rajnath singh

Related News

Lok Sabha

లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

విపక్షాల భారీ నిరసనలు, నినాదాల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు మహాత్మా గాంధీ ఫోటోలు ఉన్న పోస్టర్లను పట్టుకుని నిరసన తెలిపారు.

    Latest News

    • దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

    • విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!

    • కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

    Trending News

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

      • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd