HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >New Parliament Inauguration Ceremony On May 28 To Start With Pooja Check Full Schedule

New Parliament : ఉదయం 7.30 టు మధ్యాహ్నం 2.30.. పార్లమెంట్ ప్రారంభోత్సవం ఇలా

కొత్త పార్లమెంట్ (New Parliament) ప్రారంభోత్సవాల షెడ్యూల్ విడుదలైంది.

  • By Pasha Published Date - 07:26 AM, Fri - 26 May 23
  • daily-hunt
New Parliament
New Parliament

కొత్త పార్లమెంట్ (New Parliament) ప్రారంభోత్సవాల షెడ్యూల్ విడుదలైంది. ఈ గ్రాండ్  ప్రోగ్రామ్ ఈనెల 28న(ఆదివారం) ఉదయం 7.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.45 గంటల వరకు కొనసాగనుంది. దాదాపు 7 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పూజలతో ప్రారంభమై .. ప్రధాని మోడీ ప్రసంగంతో ఈ ఉత్సవం ముగుస్తుంది. 21 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించగా.. టీడీపీ, బీజేడీ, బీఎస్పీ, వైఎస్సాఆర్ సీపీ, జేడీఎస్ సహా దాదాపు 25 పార్టీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి.

వేడుకల వివరాలు ఇవీ..

→ ఉదయం 7.30 గంటలకు పార్లమెంట్ (New Parliament) ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర హవనం, పూజలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు.

→ పూజ ముగిసిన తర్వాత.. ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర “సెంగోల్” రాజదండాన్ని ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ‘అధీనం’ (తమిళనాడులోని శైవ మఠాల పూజారులు), చారిత్రాత్మక సెంగోల్ తయారీలో పనిచేసిన వుమ్మిడి బంగారు జ్యువెలర్స్, కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన వారిని ప్రధాని సన్మానించనున్నారు.

→ ఉదయం 9.30 గంటలకు పండితులు, సాధువులతో ప్రార్థనా సభ జరుగుతుంది.

→ పార్లమెంట్ ప్రారంభోత్సవ రెండో విడత కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ గీతాలాపనతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా రెండు షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శిస్తారు.

→ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ స్వాగత ప్రసంగం చేస్తారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి సందేశాలను కూడా చదివి వినిపిస్తారు.

→ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తారు.

→ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. ఆ వెంటనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాల  స్మారక నాణెం, స్టాంప్‌ను విడుదల చేస్తారు.

→  మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. దీంతో కార్యక్రమం ముగుస్తుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Full Schedule
  • havan and puja
  • Inauguration Ceremony
  • Kharge
  • May 28
  • new parliament
  • pm modi
  • President Murmu
  • puja

Related News

PM Modi

PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

PM Modi : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 13వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

Latest News

  • Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రివ్యూ.!

  • Mallujola Venugopal : తుపాకీ వదిలిన ఆశన్న

  • Australia Series: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?!

  • Telangana Bandh : రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలి – భట్టి

  • Sweet Cost : ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు

Trending News

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd