Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ దూకుడు.. లీడ్‌లో ప్రియాంక.. అజిత్ పవార్ వెనుకంజ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత అజిత్ పవార్ తొలి ట్రెండ్స్‌లో తన అసెంబ్లీ నియోజకవర్గం బారామతిలో(Election Results 2024) వెనుకంజలో ఉన్నారు.
- By Pasha Published Date - 09:12 AM, Sat - 23 November 24

Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రాథమికంగా విడుదలైన ఫలితాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే లీడ్‌లో దూసుకుపోతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 62 స్థానాల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Also Read :Secondary Infertility : సంతానోత్పత్తి సమస్య సంతానం తర్వాత కూడా సంభవించవచ్చు, ద్వితీయ వంధ్యత్వం అంటే ఏమిటి?
- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత అజిత్ పవార్ తొలి ట్రెండ్స్‌లో తన అసెంబ్లీ నియోజకవర్గం బారామతిలో(Election Results 2024) వెనుకంజలో ఉన్నారు.
- అజిత్ పవార్ ఎన్‌సీపీకి చెందిన జీషాన్ సిద్దిఖీ లీడ్‌లో ఉన్నారు. ఇటీవలే ముంబైలో హత్యకు గురైన బాబా సిద్దిఖీ కుమారుడే జీషాన్ సిద్దిఖీ.
- మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సకోలి స్థానం నుంచి వెనుకంజలో ఉన్నారు.
- శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాక్రే తన నియోజకవర్గం వర్లీలో ఆధిక్యంలో ఉన్నారు.
- జార్ఖండ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హైత్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.
Also Read :Winter Foods : చలికాలంలో ఆకుకూరలను ఎవరు తినకూడదు?
- 15 రాష్ట్రాలలోని 48 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళే విడుదల అవుతాయి. 8 గంటలకే అక్కడ కూడా కౌంటింగ్ మొదలైంది.
- కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో ప్రియాంకాగాంధీ దాదాపు 600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగింది.
- గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చతికిల పడింది. చివరకు అయోధ్య లోక్‌సభ స్థానంలోనూ గెలవలేకపోయింది. ఈ తరుణంలో ఇవాళ రానున్న బైపోల్ ఫలితాలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2027లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
- ఇవాళ వెలువడే ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే సంవత్సరం (2025లో) జరగనున్న బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.