Naked foreign woman: జైపూర్‌లో విదేశీ మహిళ నగ్నంగా వీరంగం
జైపూర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఓ విదేశీ మహిళ (foreign woman) నగ్నంగా వీరంగం సృష్టించింది. హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. అనంతరం హోటల్ సిబ్బందిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Author : Gopichand
Date : 18-12-2022 - 7:40 IST
Published By : Hashtagu Telugu Desk
జైపూర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఓ విదేశీ మహిళ (foreign woman) నగ్నంగా వీరంగం సృష్టించింది. హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. అనంతరం హోటల్ సిబ్బందిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపిస్తుండటం గమనించవచ్చు. హోటల్ మహిళా సిబ్బందిపై కూడా దాడి చేసింది.
పెద్ద పెద్దగా అరుస్తూ గోల గోల చేసింది. హోటల్ స్టాఫ్ ని బండ బూతులు తిట్టింది. వారిపై దాడి కూడా చేసింది. ఇదంతా ఫోన్ లో రికార్డ్ చేయగా.. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఓ విదేశీ మహిళ బస చేస్తోంది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆమె దుస్తులన్నీ విప్పేసి తన రూమ్ నుంచి బయటకు వచ్చింది. హోటల్ స్టాఫ్ పై కోపంతో ఊగిపోయింది.
Also Read: statue of Vladimir Putin: అభ్యంతరకర రీతిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ విగ్రహం
గట్టి గట్టిగా అరుస్తూ గోల చేసింది. అంతేకాదు వారిని పచ్చి బూతులు తిట్టింది. ఆ మహిళకు నచ్చ చెప్పేందుకు, ఆమెని శాంతింపజేసేందుకు స్టాఫ్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ మహిళ తీరుతో విసిగిపోయిన సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.