Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄India News
  • ⁄Mumbai High Court Order On Educated Women

High Court Order : చదువుకున్న ప్రతి మహిళా ఉద్యోగం చేయాలన్న నిబంధన లేదు..!!

ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తేనే పూటగడుస్తుంది. అందుకే భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. .పిల్లల భవిష్యత్ కోసం కష్టపడి పని చేస్తూ సంపాదిస్తున్నారు. చదువుకున్న ప్రతీ మహిళ ఖచ్చితంగా ఉద్యోగం చేయాలని ఈ మధ్యకాలంలో ఒత్తిడి బాగా పెరుగుతోంది.

  • By Bhoomi Published Date - 08:59 PM, Sat - 11 June 22
High Court Order : చదువుకున్న ప్రతి మహిళా ఉద్యోగం చేయాలన్న నిబంధన లేదు..!!

ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తేనే పూటగడుస్తుంది. అందుకే భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. .పిల్లల భవిష్యత్ కోసం కష్టపడి పని చేస్తూ సంపాదిస్తున్నారు. చదువుకున్న ప్రతీ మహిళ ఖచ్చితంగా ఉద్యోగం చేయాలని ఈ మధ్యకాలంలో ఒత్తిడి బాగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ముంబై హైకోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదువుకున్న ప్రతీ మహిళా ఖచ్చితంగా ఉద్యోగం చేయాలన్న నిబంధన లేదని వ్యాఖ్యానించింది. కేవలం ఒక మహిళా ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హతలు కలిగి ఉందన్న కారణంగా ఆమె ఉద్యోగం చేయాలని…ఇంట్లో ఉండకూడదని అర్థం కాదని జస్టిస్ భారతి డాంగ్రే తెలిపారు.

ఉద్యోగం చేయడం అనేది మహిళల ఇష్టంపైన్నే ఆధారపడి ఉంటుందన్నారు. గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన ఇంటి దగ్గర కూర్చోవడానికి వీలులేదనే వాదన సరైందికాదన్నారు. స్థిరమైన ఆదాయాన్ని పొందుతోన్న ఓ భార్య తన భర్త నుంచి భరణం కోరిందన్న కేసు విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ భారతి. 2010లో ఓ జంట పెళ్లి చేసుకుంది. 2013 నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. కూతురు తల్లితో ఉంటోంది. ఈ క్రమంలో తనకు భర్త నుంచి మెయింటెనెన్స్ కావాలని సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. కుటుంబ న్యాయస్థానంలో తనతోపాటు..తనకూతురు జీవనానికి సరిపడే డబ్బు భర్త నుంచి అందించాలని పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు భార్యకు నెలకు రూ. 5వేలు చిన్నారి పోషణ కోసం రూ.7వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే భర్త…తన భార్య ఉద్యోగం చేస్తోందని..తనకు ఆదాయం మార్గం లేదని తప్పుడు సమాచారంతో పిటిషన్ దాఖలు చేసిందని సవాలుగా మరో పిటిషన్ దాఖలు చేశాడు.

ఈనేపథ్యంలో శుక్రవారం విచారణకు వచ్చిన ఈ కేసు…జస్టిస్ భారతి డాంగ్రే ఈ వ్యాఖ్యలు చేశారు. పనిచేయాలా వద్దా అనేది మహిళా హక్కు…ఆమె గ్రాడ్యుయేట్ అయితే…పనిచేకూడదనే నిబంధన ఏమందంటూ ప్రశ్నించారు. తనను తాను ఉదాహరణాగా ప్రస్తావించారు. ఈ రోజు నేను జడ్జిని రేపు ఇంట్లో కూర్చుంటాను..నీకు న్యాయమూర్తి అయ్యే అర్హత ఉంది..ఇంట్లో కూర్చోకూడదని చెబుతారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.

Tags  

  • educated women
  • High Court
  • mubai high court
  • women rights

Related News

Telangana : నేడు తెలంగాణ చీఫ్ జ‌స్టిస్‌గా భూయ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం

Telangana : నేడు తెలంగాణ చీఫ్ జ‌స్టిస్‌గా భూయ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల 5 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఉజ్జల్ భూయన్ చేత గవర్నర్‌ తమిళి సై ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వ‌స్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొన‌సాగుతుంది. గత కొద్ది రోజులుగా రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య

  • NIA Takes: ఎన్ఐఏ అదుపులో మహిళ న్యాయవాది చుక్కా శిల్ప!

    NIA Takes: ఎన్ఐఏ అదుపులో మహిళ న్యాయవాది చుక్కా శిల్ప!

  • High Court: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్

    High Court: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్

  • Chennai Court: జైభీమ్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడికి షాక్

    Chennai Court: జైభీమ్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడికి షాక్

  • Mahashivudu: భూ కబ్జా కేసు.. కోర్టుకు హాజ‌రైన మ‌హాశివుడు..!

    Mahashivudu: భూ కబ్జా కేసు.. కోర్టుకు హాజ‌రైన మ‌హాశివుడు..!

Latest News

  • Schools: పాఠశాలలకు ఆ రోజు సెలవు ఇవ్వాల్సిందే…లేదంటే చర్యలు తప్పవు..!!

  • Sprouts on Empty Stomach: ఖాళీ కడుపుతో మొలకెత్తిన గింజలు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయ్?

  • Music Maestro Ilayaraja: సంగీత సామ్రాజ్యాధిపతికి వందనం

  • Chandrababu : రాజంపేటపై చంద్ర‌బాబు ఫోక‌స్, ఎంపీ అభ్య‌ర్థి ఆయ‌నే?

  • Vitamin D : విటమిన్ డి సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ప్రాణానికే ముప్పు…ఈ సమస్యలు తప్పవు..!!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: