Mukesh Ambani: శివరాత్రి నాడు మంచి మనసు చాటుకున్న ముఖేశ్ అంబానీ.. రూ.1.51 కోట్ల విరాళం..!
భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కూడా గుజరాత్‌లోని శివాలయానికి చేరుకున్నారు. అంబానీ కుటుంబం కూడా చాలా భక్తి శ్రద్ధలు కల కుటుంబం.
- By Gopichand Published Date - 04:00 PM, Sun - 19 February 23

మహాశివరాత్రి పండుగను శనివారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. శివాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పరిశ్రమల ప్రముఖులు కూడా శివాలయాలకు చేరుకుని పూజలు చేశారు. భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కూడా గుజరాత్‌లోని శివాలయానికి చేరుకున్నారు. అంబానీ కుటుంబం కూడా చాలా భక్తి శ్రద్ధలు కల కుటుంబం. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం వివిధ సందర్భాలలో వివిధ ప్రదేశాలలో ప్రార్థనలు, విరాళాలు అందించడం చాలాసార్లు కనిపించింది.
శనివారం మహాశివరాత్రి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి చేరుకుని తన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి సోమనాథ్ మహాదేవ్‌కు రుద్రాభిషేకం చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం.. అంబానీ కుటుంబం తరపున సోమనాథ్ ఆలయ ట్రస్టుకు రూ.1.51 కోట్ల విరాళం కూడా అందిచినట్లు సమాచారం.
అంబానీ పూజలు
సోమనాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చిన ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీలకు ఆలయ ట్రస్ట్ చైర్మన్ పీకే లాహిరి, కార్యదర్శి యోగేంద్ర దేశాయ్ స్వాగతం పలికారు. వీరికి ఆలయ ట్రస్టు శాలువా, చందనంతో స్వాగతం పలికారు. ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీ సోమనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. భోలేనాథ్ కి రుద్రాభిషేకం కూడా చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖేష్ అంబానీ లేత గులాబీ రంగు దుస్తులలో కనిపిస్తుండగా, ఆకాష్ అంబానీ లేత నీలం రంగు కుర్తాలో కనిపిస్తున్నారు.
Also Read: Shiva Temples: ఒకే సరళ రేఖ పై 7 శివాలయాలు ఎలా నిర్మించారంటే?
గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ మహాదేవ్ ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. హిందువులు సోమనాథ్ ఆలయం పట్ల మత విశ్వాసం కలిగి ఉంటారు. భోలేనాథ్‌ను సందర్శించడానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సోమనాథ్ ఆలయం గుజరాత్‌లోని గిర్ జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో వెరావల్ పురాతన నౌకాశ్రయానికి సమీపంలో ఉంది.