Ms Dhoni Dance: అంబానీ వెడ్డింగ్ ఈవెంట్ లో ధోనీ మాస్ డ్యాన్స్
క్రికెట్ మైదానంలో సిక్సర్లతో అభిమానులను ఉర్రూతలూగించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అనంత్ అంబానీ వివాహానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. పెళ్లి ఊరేగింపులో ధోనీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
- By Praveen Aluthuru Published Date - 07:12 PM, Sat - 13 July 24

Ms Dhoni Dance: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో రాధిక మర్చంట్‌ను ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహా వేడుకకు దేశ, విదేశాల్లోని అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యారు. క్రికెట్ రంగం నుంచి సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్ తదితరులు కూడా ఉన్నారు. సాధారణంగా మైదానంలో తమ ఆటతో ప్రజల దృష్టిని ఆకర్షించే క్రికెటర్లు.. పెళ్లిలో తమ డ్యాన్స్‌తో అక్కడ ఉన్న అభిమానులు, అతిథుల దృష్టిని ఆకర్షించారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
క్రికెట్ మైదానంలో సిక్సర్లతో అభిమానులను ఉర్రూతలూగించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అనంత్ అంబానీ వివాహానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. పెళ్లి ఊరేగింపులో ధోనీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రికెట్‌లో బౌలర్లను డ్యాన్స్ చేయించే ధోనీ.. అనంత్ పెళ్లిలో జోరుగా డ్యాన్స్ చేశాడు. అతను డ్యాన్స్ చేయడం చూసి యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఆగలేక డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ధోనీ, కిషన్ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
MS Dhoni dancing with Ishant Kishan. 😄❤️pic.twitter.com/neWObVSX9b
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 13, 2024
ఓ వైపు అనంత్ అంబానీ వివాహానికి రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకాగా, మరోవైపు భారత్‌లోని పలువురు ప్రముఖ క్రికెటర్లు ఈ వివాహానికి హాజరుకాలేదు. వివాహ వేడుకలో కనిపించని క్రికెటర్లలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా కూడా ఇంగ్లాండ్‌లో ఉన్నారు. వీరు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాల్గొంటున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ గైర్హాజరు కావడానికి గల కారణాలు తెలియరాలేదు.