HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Modis Special Gift To Italian Prime Minister Meloni

PM Modi- Giorgia Meloni: ఇటలీ ప్రధాని మెలోని కి.. మోడీ స్పెషల్‌ గిఫ్ట్..

  • Author : Vamsi Chowdary Korata Date : 20-05-2026 - 2:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi's Special Gift to Italian Prime Minister Meloni
Modi's Special Gift to Italian Prime Minister Meloni

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను నెటిజన్లు సరదాగా ‘మెలోడి’ అని పిలుస్తుంటారు. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ క్రేజ్‌ను మోదీ భలే వాడుకున్నారు. తన ఇటలీ పర్యటనలో భాగంగా మెలోనికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చి అందరినీ నవ్వించారు.

స్వీట్ గిఫ్ట్
ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్నారు మోదీ. ఈ సందర్భంగా మెలోనిని కలిసిన ఆయన.. భారత్‌లో ఎంతో పాప్యులర్ అయిన ‘పార్లే మెలొడీ’ చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇద్దరు నేతల పేర్లను కలిపి ఇంటర్నెట్‌లో నడుస్తున్న ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని మోదీ ఈ సరదా గిఫ్ట్ ప్లాన్ చేశారు.

Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA

— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026

వీడియో వైరల్
ఈ చాక్లెట్ ప్యాకెట్‌ను అందుకున్న మెలోని.. ప్రధాని మోదీతో కలిసి దిగిన ఒక చిన్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ‘బహుమతికి చాలా థాంక్స్’ అని ఆమె రాశారు. వీడియోలో మెలోని మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ నాకోసం చాలా మంచి టోఫీలు తెచ్చారు’ అనగానే, పక్కనే ఉన్న మోదీ నవ్వుతూ ‘మెలొడీ’ అని అన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గంట వ్యవధిలో లక్షకు పైగా లైక్స్‌, దాదాపు 9,000 కామెంట్స్‌, 25 వేలకు పైగా షేర్స్‌ వచ్చాయి.

కార్ డిప్లొమసీ
రోమ్ చేరుకున్న మోదీకి మెలోనీ ఘన స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి కార్‌లో ప్రయాణిస్తూ నగర వీధుల్లో సందడి చేశారు. తర్వాత రాత్రి పూట రోమ్‌లోని ప్రసిద్ధ చరిత్రాత్మక కట్టడం కొలోసియంను సందర్శించారు. అక్కడ కాసేపు నడుస్తూ ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు.

బహుమతిగా కాశీ చిత్రం
ఈ పర్యటనలో మోదీని ఇటలీకి చెందిన ప్రముఖ చిత్రకారుడు జాంపాలో టొమాసెట్టి కలిశారు. ఆయన స్వయంగా గీసిన వారణాసి (కాశీ) పెయింటింగ్‌ను మోదీకి బహుమతిగా ఇచ్చారు. టొమాసెట్టికి భారతీయ సంస్కృతిపై ఉన్న ఇష్టాన్ని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా అభినందించారు. రోమ్‌ నగరంలో కాశీ దృశ్యాలను చూడటం ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chocolate
  • Giorgia Meloni
  • india
  • Indian PM Narendra Modi
  • italy
  • Melody
  • PM Modi- Giorgia Meloni

Related News

Modi is a traitor: Rahul Gandhi

Rahul Gandhi: మోడీ దేశద్రోహి : రాహుల్‌గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ ‘దేశద్రోహి’ అని విమర్శించారు. దేశాన్ని అమ్మేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన మీకు ధన్యవాదాలు. ఇంటికి వెళ్లాక మీ దగ్గరకు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు వ

  • An economic crisis is looming in the country: Rahul Gandhi

    Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

  • 10 Years in Jail for Taking Photos on a Plane: Dubai Court Delivers Sensational Verdict

    Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. దుబాయ్ కోర్టు సంచలన తీర్పు

  • CM Chandrababu Naidu

    Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

Latest News

  • Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!

  • Sunil Narang: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

  • HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

  • Supreme Court: జనగణనలో కులగణనపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

  • PM Modi- Giorgia Meloni: ఇటలీ ప్రధాని మెలోని కి.. మోడీ స్పెషల్‌ గిఫ్ట్..

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd