Modi Schemes : కేంద్ర ప్రభుత్వం నుంచి సరికొత్త హెల్త్ స్కీం, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..!!
దేశవాసులందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో...ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న మూడు ఆరోగ్య పథకాలపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
- By hashtagu Published Date - 02:31 PM, Tue - 9 August 22

దేశవాసులందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో…ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న మూడు ఆరోగ్య పథకాలపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న పీఎం జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ మిషన్ను ఒకే పథకం కింద కేంద్ర సర్కారు అమలు చేయనుంది. పీఎం సమగ్ర స్వస్త్య యోజన పేరుతో దీన్ని తీసుకువస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
నాణ్యమైన వైద్య సేవలతోపాటు అందుబాటు ధరలు అందించడం ఈ పథఖం లక్ష్యమని తెలుస్తోంది. ప్రధానమంత్రి ప్రకటన తర్వాతే ఈ పథకం గురించి సమగ్ర వివరాలు తెలిసే అవకాశం ఉంటది. హీల్ బై ఇండియా పేరుతో మరో పథకాన్ని కూడా ప్రధాని ప్రకటించనున్నారు. ఈ పథకం కింద మనదేశ వైద్యులను ఏటా కొంతమందిని విదేశాలకు పంపించి అక్కడ చికిత్సల విధానాలపై శిక్షణ ఇప్పిస్తారు. హీల్ ఇన్ ఇండియా అనేది మరో పథకం. దీని కింద భారత్ లో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యం.