PM Modi: సోనియాగాంధీకి మోడీ బర్త్ డే విషెస్
సోనియా గాంధీ 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
- Author : Balu J
Date : 09-12-2023 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. “సోనియా గారికి శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా ఆమె దీర్ఘాయువు తో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలి” అంటూ X లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత కొన్నేళ్లుగా ఆరోగ్య కారణాల రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా గాంధీభవన్ ఆవరణలో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సోనియమ్మ జన్మదిన వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియానుద్దేశించి మాట్లాడారు. శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ అని, డిసెంబర్ 9, 2019లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని ఆయన గుర్తు చేశారు.
Best wishes to Smt. Sonia Gandhi Ji on her birthday. May she be blessed with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 9, 2023