Massive Fire Breaks Out: గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం.. 10 గోడౌన్‌లు దగ్ధం
గుజరాత్‌లోని వాపి అనే ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire Breaks Out) జరిగింది. ఈ ప్రమాదంలో 10 గోడౌన్‌లు దగ్దమయ్యాయని అధికారులు తెలిపారు.
- By Gopichand Published Date - 11:51 AM, Tue - 14 March 23

గుజరాత్‌లోని వాపి అనే ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire Breaks Out) జరిగింది. ఈ ప్రమాదంలో 10 గోడౌన్‌లు దగ్దమయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్‌లోని వాపి ప్రాంతంలోని 10 జంక్ గోడౌన్లలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఇంతకు ముందు కూడా గుజరాత్‌లోని వల్సాద్‌లోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దేశంలో వేసవి కాలం ప్రారంభమైన వెంటనే అనేక చోట్ల అగ్ని ప్రమాదాలు నిరంతరం వెలుగులోకి వస్తున్నాయి.
Also Read: Mumbai Slums: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 800 గుడిసెలు దగ్ధం
మధురైలోని పాత విడిభాగాల గోడౌన్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు తమిళనాడు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలోని ఫర్నీచర్ గోడౌన్‌లో సోమవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలోని రామాలయం సమీపంలో ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు సమాచారం అందించారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
కాగా, ముంబై నగరంలో సోమవారం సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో ఆనంద్ నగర్ (మలాడ్ ఈస్ట్)లోని అప్పా పాడా మురికివాడలో రెండో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 4 గంటల పాటు శ్రమించిన తర్వాత రాత్రి 9.35 గంటల ప్రాంతంలో మంటలను అదుపు చేయగలిగారు. మంటలు అదుపులోకి వచ్చే సమయానికి దాదాపు 2 వేల గుడిసెలకు వ్యాపించాయి. ఈ దహనంలో ఒకరు మృతి చెందినట్లు కూడా వార్తలు వచ్చాయి. కాగా గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. గుడిసెలలోని ఎల్‌పిజి సిలిండర్లు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. అలాగే మురికివాడ ఒక కొండ ప్రాంతంలో అటవీ భూమిలో ఉంది. దీంతో ముంబై అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకోవడానికి సమయం పట్టింది.

Related News

Gujarat Titans: ఈ సారీ టైటిల్ మాదే.. కాన్ఫిడెంట్ గా గుజరాత్ టైటాన్స్
టైటిల్ ఫేవరెట్ జట్లలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ముందుంటుందనడంలో డౌట్ లేదు. గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ అరంగేట్రంలోనే అదరగొట్టేసింది.