Maoists kill BJP leader: బీజేపీ నేతను నరికి చంపిన మావోయిస్ట్‌లు
చత్తీగఢ్ రాష్ట్ర బీజేపీ నేత నీల్‌కాంత్‌ను మావోయిస్ట్‌లు (Maoists) దారుణంగా హత్య చేశారు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఊరెళ్లిన ఆయనపై మావోలు గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారని ఏసీపీ చంద్రకాంత్ తెలిపారు. అతడిని ఇంటి నుంచి లాక్కెళ్లి, అందరూ చూస్తుండగానే హత్యచేశారని నీలకాంత్ భార్య చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 12:35 PM, Mon - 6 February 23

చత్తీగఢ్ రాష్ట్ర బీజేపీ నేత నీల్‌కాంత్‌ను మావోయిస్ట్‌లు (Maoists) దారుణంగా హత్య చేశారు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఊరెళ్లిన ఆయనపై మావోలు గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారని ఏసీపీ చంద్రకాంత్ తెలిపారు. అతడిని ఇంటి నుంచి లాక్కెళ్లి, అందరూ చూస్తుండగానే హత్యచేశారని నీలకాంత్ భార్య చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు మరోసారి ప్రజాప్రతినిధిని హతమార్చారు. అంతే కాదు నక్సలైట్లు కుటుంబసభ్యులందరి సమక్షంలోనే ఈ ఘటనకు పాల్పడ్డారు. నక్సలైట్లు ఉసూర్ బ్లాక్ బీజేపీ మండల అధ్యక్షుడు, సీనియర్ బీజేపీ (BJP) నాయకుడు నీల్‌కాంత్ కక్కెంను కత్తి, గొడ్డలితో హత్య చేశారు. ఇంతకు ముందు కూడా నక్సలైట్లు బిజెపి నాయకుడు నీల్‌కాంత్ కక్కెమ్‌కు అల్టిమేటం ఇచ్చారని, అయితే ఆదివారం నక్సలైట్లు.. నీల్‌కాంత్ తన కోడలు పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు అవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అతని స్వగ్రామమైన పెంకరంకు వచ్చారు. కుటుంబసభ్యుల ఎదుటే అతడిపై దాడి చేసి.. హత్య చేయడంతో ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది.
Also Read: Cancer Patient: క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది
ఆవపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జికి అందిన సమాచారం ప్రకారం.. గత 15 ఏళ్లుగా ఉసూరు బ్లాక్‌లో బీజేపీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బీజేపీ నాయకుడు నీల్‌కాంత్ ఆదివారం ఉదయం ఆవపల్లి పేకారం గ్రామానికి కోడలు వివాహ వేడుకకు వెళ్లాడు. అక్కడ మెరుపుదాడి చేసిన నక్సలైట్లు అతడి హత్య ఘటనను కుటుంబసభ్యులందరి సమక్షంలోనే చేశారు. కక్కం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే అవపల్లి పోలీస్‌స్టేషన్ నుంచి పోలీసులు వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నక్సలైట్లు అక్కడే ఓ కరపత్రాన్ని కూడా వదిలి వెళ్లారు