Manmohan Singh : మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలు..ఫలితాలు
Manmohan Singh : లిబరలైజేషన్ (వ్యాపారాలకు నియంత్రణల తొలగింపు), గ్లోబలైజేషన్(విదేశీ పెట్టుబడుల కోసం మల్టీనేషనల్ కంపెనీలకు అనుమతి), ప్రైవేటీకరణ (ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రోత్సహించారు
- By Sudheer Published Date - 05:50 AM, Fri - 27 December 24

1991 నాటికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ నిల్వలు అడుగంటిపోయాయి. అప్పులు పెరిగి రూపాయి విలువ తగ్గింది. ఆ సమయంలో ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)తో కలిసి ఆర్థిక మంత్రిగా మన్మోహన్(Manmohan as finance Minister) జట్టుకట్టారు. లిబరలైజేషన్ (వ్యాపారాలకు నియంత్రణల తొలగింపు), గ్లోబలైజేషన్(విదేశీ పెట్టుబడుల కోసం మల్టీనేషనల్ కంపెనీలకు అనుమతి), ప్రైవేటీకరణ (ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రోత్సహించారు. ఈ సంస్కరణలు (Economic Reforms) దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేశాయి.
ఆర్థిక వ్యాపార లిబరలైజేషన్
1991లో నూతన ఆర్థిక విధానాన్ని అమలు పరిచిన మన్మోహన్, లైసెన్స్ రాజ్ వ్యవస్థను క్రమంగా తొలగించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) మార్గం సుగమం చేసి, ప్రపంచ మార్కెట్‌కు భారతీయ వ్యాపారాలను అనుసంధానించారు. ఈ చర్యలు భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడ్డాయి.
Read Also : Manmohan Singh : తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చిన మన్మోహన్
ఆర్థిక మౌలికవాదానికి స్వస్తి
ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించి, ప్రైవేట్ రంగానికి పెద్ద పీట వేస్తూ, మన్మోహన్ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టడంతో పాటు పన్నుల సరళీకరణ విధానాలను అమలు చేశారు. ఈ చర్యలు భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసాయి. ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశంలో ఉపాధి అవకాశాలు విస్తరించాయి. ఐటీ, టెలికాం రంగాల్లో అసాధారణ పురోగతిని సాధించడంలో ఈ సంస్కరణలు కీలకంగా నిలిచాయి. భారతీయ యువత అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఉద్యోగాలకు చేరువయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థ 21వ శతాబ్దంలో వేగంగా అభివృద్ధి చెందడానికి ఈ నిర్ణయాలు బలమైన పునాది అయ్యాయి.
మన్మోహన్ సింగ్ ప్రభావం
ఆర్థిక మంత్రిగా, అనంతరం ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ అందించిన సేవలు భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. 1991 ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యూహాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సంస్కరణల వల్ల నేడు భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిందని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే ఆర్థిక సంస్కరణల అమలుతో 1996 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 1996-98 మధ్య యునైటెడ్ ఫ్రంట్, 1998-2004 మధ్య బీజేపీ నేత వాజపేయి సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొనసాగింది. తిరిగి 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోనియాగాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకున్నది.
Read Also : Manmohan Singh Dies : వారం రోజులు సంతాప దినాలు – కేంద్రం ప్రకటన
మిత్రపక్షాల మద్దతుతో ఏర్పాటైన యూపీఏ కూటమి తొలి విడుత ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఐదేండ్లు పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత రెండోసారి ప్రధానిగా నియమితులైన కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్. 2009లో యూపీఏ కూటమి మరింత మెజారిటీ సాధించింది. దీంతో రెండోసారి ప్రధానిగా మన్మోహన్ సింగ్ 2009లో పదవీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి 2014 వరకూ ప్రధానిగా పదేండ్ల పాటు కొనసాగారు. యూపీఏ ప్రభుత్వ సారధిగా మన్మోహన్ సింగ్ హయాంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, పౌరులందరికీ గుర్తింపు కార్డు ఆధార్ జారీ చేసేందుకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ, జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం చేశారు.
Read Also : Tripti Dimri : యానిమల్ బ్యూటీతో ప్రేమకథ తీస్తున్నారా..?