Manmohan Singh Dies : వారం రోజులు సంతాప దినాలు – కేంద్రం ప్రకటన
Manmohan Singh Dies : దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేయాలని కేంద్రం ఆదేశించింది
- Author : Sudheer
Date : 27-12-2024 - 5:17 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (EX PM Manmohan Singh) ఆకస్మిక మరణం దేశాన్ని తీవ్ర దుఃఖంలోకి నెట్టింది. భారత రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజుల సంతాప దినాలుగా (Govt National Mourning) ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేయాలని కేంద్రం ఆదేశించింది.
కేంద్రం ప్రకటించిన ప్రకారం, వారం రోజులు దేశవ్యాప్తంగా సంతాప దినాలను పాటిస్తారు. ఈ సందర్భంగా ఆయన్ని గౌరవిస్తూ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు చేయనున్నారు. అంతేకాకుండా, ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈరోజు కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు మరోసారి గుర్తు చేసుకుంటారు.
అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందని ప్రధాని మోడీ అన్నారు. నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారని కొనియాడారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ప్రశంసించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే ‘ఆయన అసలేం మాట్లాడరు’ అని అంతా అంటుంటారు. అవును నిజమే. చాలామంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన మన్మోహన్.. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే అత్యధిక జీడీపీ 10.2శాతం వృద్ధిరేటు నమోదైంది. వెనుకబడిన వర్గాలకు 27 శాతం సీట్ల కేటాయింపు జరిగింది.
ఆర్థిక మంత్రిగా విజయం సాధించిన తరువాత, సింగ్ ప్రధానమంత్రి స్థానానికి చేరుకున్నారు. అక్కడ అతను యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ప్రభుత్వంలో 2004 నుండి 2014 వరకు వరుసగా రెండు సార్లు పనిచేశాడు. పాలన, అవినీతి కుంభకోణాలు మరియు రాజకీయ హోరిజోన్‌తో సహా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం భారతదేశ ఆర్థిక వృద్ధిలో గణనీయమైన పురోగతిని కలిగి ఉంది.
Read Also : Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?