Ahmedabad Plane Crash : బ్రతికింది ఇతడొక్కడే..నిజంగా ఇతడు మృత్యుంజయుడే !!
Ahmedabad Plane Crash : "విశ్వాస్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి స్థిరంగా ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని పేర్కొన్నారు.
- By Sudheer Published Date - 07:32 PM, Thu - 12 June 25

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. విమానంలో మొత్తం 242 మంది ఉన్నప్పటికీ, ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11A సీటు(11A )లో ప్రయాణించిన విశ్వాస్ కుమార్ రమేశ్ (Vishwas Kumar Ramesh) అనే వ్యక్తి (వయస్సు 40) ఆ ప్రమాదం నుంచి సజీవంగా బయటపడ్డారు.
Shivaji Bridge Station : పట్టాలు తప్పిన రైలు
అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. “విశ్వాస్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి స్థిరంగా ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని పేర్కొన్నారు. ఎలాంటి అద్భుతం జరగకపోతే అంతటి పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం అసాధ్యమేనని అధికారులు చెబుతున్నారు. విశ్వాస్‌ను “మృత్యుంజయుడు” అని పిలుస్తున్నారు.
Ahmedabad Plane Crash : కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సభ వాయిదా
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. విమానం జనాభా కేంద్రమైన ప్రాంతంపై కూలినందున, భవనాలు, చెట్లకు తగిలి పెద్ద ఎత్తున ధ్వంసం జరిగింది. దీంతో స్థానికులలో కూడా ప్రాణనష్టం జరిగింది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా, పూర్తి వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.