Mamata Banerjee is Injured : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి తీవ్ర గాయం..హాస్పటల్ లో చేరిక
- By Sudheer Published Date - 09:07 PM, Thu - 14 March 24

బంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee)కి తీవ్ర గాయమైంది (Injured ). దీంతో ఆమెను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం హాస్పటల్ (SSKM Hospital ) లో చేర్పించారు. ఇంట్లో వ్యాయమం చేస్తుండగా ఆమె కిందపడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన లో ఆమె నుదుటి తీవ్ర గాయమైంది. ఆ గాయానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారంతా దీదీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్ లో ఆమెకు చికిత్స కొనసాగుతుంది. ఇక ఈ ఏడాది లో ఈమె గాయపడటం ఇది రెండోసారి అంటున్నారు. జనవరి నెలలో బర్దమాన్ జిల్లా నుంచి ఆమె తిరిగి వస్తున్న సమయంలో కాన్వాయ్ లోని కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. బర్ధమాన్ నుంచి వస్తున్న సమయంలో తీవ్ర వర్షం పడుతుంది.. ఆ సమయంలో డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో ఆమె ముందుకు ఒరిగిపోయింది. దీంతో తలకు గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో వెంటనే కోలుకున్నారు. ఇప్పుడు మరోసారి మమతాకు గాయం కావడంతో టీఎంసీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
https://twitter.com/AITCofficial/status/1768286010264502610?
Read Also : AP : టీడీపీ – జనసేన శ్రేణులే జగన్ ను గెలిపించేలా ఉన్నారు..ఎందుకంటే..!!