HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Jana Sena Lines Are Likely To Win Jagan

AP : టీడీపీ – జనసేన శ్రేణులే జగన్ ను గెలిపించేలా ఉన్నారు..ఎందుకంటే..!!

  • Author : Sudheer Date : 14-03-2024 - 8:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janasena Tdp Ycp
Janasena Tdp Ycp

ప్రస్తుతం టీడీపీ (TDP) – జనసేన (Janasena) పార్టీల శ్రేణుల్లో ఆగ్రహపు జ్వాలలు చూస్తే అలాగే అనిపిస్తుంది. జగన్ (Jagan) ను ఓడించాలంటే సింగిల్ గా వెళ్లకూడదని చెప్పి పొత్తులు పెట్టుకొని బరిలోకి దిగుతుంటే..ఈ పొత్తులే ఈ రెండు పార్టీల కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ – జనసేన నేతలు , కార్యకర్తలు అధినేతల తీరు ఫై మండిపడుతున్నారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తూ..జేబులో నుండి డబ్బులు ఖర్చుపెడుతూ..ప్రత్యర్థి పార్టీల నుండి నానా మాటలు పడుతూ..వారి పెట్టె కేసుల కారణంగా జైలు పాలవుతూ..కోర్టుల చుట్టూ తిరుగుతూ నానాసంకాలు నాకుతుంటే..ఇప్పుడేమో మీకు కాదు టికెట్..మన పొత్తు పార్టీ అభ్యర్థికి ఇస్తున్నాం,,మద్దతు ఇవ్వండి అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు.. ఇప్పుడు ఇదే అంటున్నారు జనసేన , టీడీపీ నేతలు. బయటకు గట్టిగా చెప్పకపోయినా..వెనుకాల చేయాల్సిన పనులు , రాయబారాలు చేస్తూనే ఉన్నారు.

ముందుగా జనసేన విషయానికి వస్తే..జనసేన పార్టీ ప్రారంభించి నేటికీ 11 ఏళ్లు అవుతుంది. ఇంతకాలం పార్టీ అధినేత అధ్యక్షా కాదు కదా..కనీసం అసెంబ్లీ గేటు తాకలేదు. పార్టీ పెట్టినప్పుడు కొత్తగా ఏపీ రాష్ట్రం ఏర్పడదని చెప్పి అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అవుతే బాగుంటుందని ఆనాడు చంద్రబాబు – బిజెపి (BJP) లకు సపోర్ట్ ఇచ్చి చంద్రబాబు ను సీఎం చేసారు. ఆ తర్వాత ఏర్పడిన అభిప్రాయ విభేదాల కారణంగా టీడీపీ కి దూరమై. గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి సింగిల్ స్థానం తెచ్చుకున్నాడు. అది కూడా కొద్దీ నెలలకే వైసీపీ లోకి వెళ్ళింది. అయినప్పటికీ పవన్ ఏమాత్రం నిరాశ పడకుండా పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడుతూ వచ్చారు. ఓ పక్క సిఎంమాలు చేస్తూనే , మరోపక్క రాజకీయాలు చేస్తూ వచ్చారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు తో పార్టీ ని నడుపుతూ , కౌలు రైతు కుటుంబాలను ఆదుకుంటూ వచ్చి.. జనసేన ఫై ప్రజల్లో , పార్టీ శ్రేణుల్లో నమ్మకం పెంచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో జనసేన ను గెలిపించాల్సిందే అని ప్రజలు , పార్టీ శ్రేణులు భవిస్తూ వచ్చారు. తీరా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ టీడీపీ తో చేతులు కలిపి తన గోతిలో తానే పడ్డట్లు చేసుకున్నాడు పవన్.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ తీసుకున్న ఈ నిర్ణయం జనసేన నేతలకు కానీ , శ్రేణులకు కానీ ఏమాత్రం నచ్చలేదు. టీడీపీ తో చేతులు కలపడం ఏంటి అని ప్రశ్నించారు. దీంతో పవన్…శ్రేణులను , నేతలను సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. సరే చుద్దాలే అనుకున్నారు..ఇక ఇప్పుడు 21 సీట్లతో సరిపెట్టుకోవడంతో రగిలి పోతున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికీ టికెట్ లేకుండా టీడీపీ నేతలకు టికెట్ ఇచ్చేసరికి కొంతమంది పార్టీ ని వీడడం చేయగా..మరికొంతమంది పార్ట్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. బయటకు జై జనసేన అంటున్న లోలోపల మాత్రం ఆగ్రహం , బాధతో రగిలిపోతూ..ఈసారి ఈ రెండు పార్టీలకు కాకుండా జగన్ కే సపోర్ట్ చేస్తే సరిపోతుందని వారి అభిమానులకు , పార్టీ శ్రేణులకు చెప్పుకొస్తున్నారట. మరోపక్క పవన్ సైతం టికెట్ రాని నేతలకు సర్దిచెప్పడం కానీ , కార్యకర్తలకు క్లియర్ గా దిశా నిర్దేశం చేయడం కానీ చేయడం లేదు..ఎంతసేపు పొత్తు..పొత్తు అంటూ వెళ్తున్నారు తప్ప..దేని గురించి మాట్లాడడం లేదు. అంతే కాదు మొన్నటికి మొన్న పార్టీ లో ఎంతో గుర్తింపు ఉన్న రాయపాటి అరుణ ఫై దాడి జరిగిన స్పందించలేదు. అలాగే తెనాలికి చెందిన గీతాంజలి అనే వివాహిత ఆత్మ హత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్య కు కారకులెవరైనా సరే సాటి మనిషిగా ఈ ఘటన ను ఖండించడం కానీ ఇలాంటి తప్పు చేయకూడదని చెప్పడం చేయాలి. కానీ అవేమి చేయకుండా సైలెంట్ గా ఉండడం. పార్టీ శ్రేణులకే కాదు పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారు సైతం పవన్ ఫై విమర్శలు చేస్తున్నారు. మరి వీరంతా ఎన్నికల్లో జనసేన కు సపోర్ట్ చేస్తారనేది కష్టమే అని తెలుస్తుంది.

ఇక టీడీపీ విషయానికి వస్తే..గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు కు జనసేన సపోర్ట్ కాస్త ఉత్సాహాన్ని నింపింది. ఇదే క్రమంలో పవన్ ముందుండి బిజెపి తో పొత్తు కుదర్చడం..సీట్లను సైతం తగ్గించుకోవడం వంటివి బాబుకు కలిసొచ్చేలా చేసింది. కానీ ఇప్పుడు ఇదే పొత్తు కారణంగా సీనియర్లకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి రావడం..టీడీపీ కి పట్టున్న స్థానాలను జనసేన కు ఇవ్వడం ఫై ఆయా ప్రాంతాల టీడీపీ శ్రేణులు బాబు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పార్టీకి రాజీనామా చేసి వైసీపీ లో చేరగా..ఈరోజు రిలీజ్ చేసిన రెండో జాబితా తర్వాత పలు ప్రాంతాల్లో ఆగ్రహపు జ్వాలలు ఎగిసి పడ్డాయి. కొంతమంది రాజీనామా చేయడం , చేసేందుకు సైతం సిద్ధం అవుతున్నారు. వీరంతా టీడీపీ – జనసేన కు సపోర్ట్ చేస్తారనేది అనుమానం గా మారింది. మొత్తం మీద మాత్రం పొత్తు వల్ల జగన్ కు నష్టం కంటే లాభమే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే జగన్ సైతం పెద్దగా విమర్శలు చేయకుండా…పార్టీలలో వస్తున్న ఆగ్రహపు జ్వాలలను ఎంజాయ్ చేస్తున్నాడు. చూద్దాం పోలింగ్ సమయం వరకు ఏమవుతుందో..!!

Read Also : Jowar Cake: ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండి కేక్ ను ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP-TDP-Janasena Alliance
  • chandrababu
  • Pawan Kalyan
  • TDP - Jana Sena
  • ycp

Related News

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd