Malaika Arora Father Suicide: నేను అలసిపోయాను బెటా: మలైకా తండ్రి చివరి కాల్
Malaika Arora Father Suicide: ముంబై పోలీసుల ప్రకారం మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా మరణం ప్రాథమికంగా ఆత్మహత్యగా కనిపిస్తోంది. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమర్పించినట్లు డీసీపీ క్రైం బ్రాంచ్ రాజ్ తిలక్ రోషన్ మీడియాకు తెలిపారు
- Author : Praveen Aluthuru
Date : 11-09-2024 - 7:37 IST
Published By : Hashtagu Telugu Desk
Malaika Arora Father Suicide: మలైకా అరోరా తండ్రి ఆత్మహత్యతో బాలీవుడ్ ఉలిక్కిపడింది.ముంబై పోలీసుల బృందం ఉదయం నుంచి మలైకా నివాసంలో ఉంది. అనిల్ మెహతా (Anil Mehta) మృతికి సంబంధించిన మరో షాకింగ్ వివరాలు బయటకు వచ్చాయి. ఆత్మహత్యకు ముందు అనిల్ మెహతా తన కుమార్తెలిద్దరికీ ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. కుమార్తెలకు ఫోన్ చేసి అలసిపోయాను అని అన్నాడట.
అనిల్ మెహతా ఆత్మహత్యకు ముందు అమృతా అరోరా (Malaika Arora) మరియు మలైకా అరోరాలకు ఫోన్ చేసి మాట్లాడారు. ‘నేను అలసిపోయాను’ అని అనిల్ మెహతా తన కుమార్తెలిద్దరితో ఫోన్‌లో చెప్పాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఈ కాల్ వచ్చింది. అనిల్ మెహతా తన ఫ్లాట్‌లోని ఆరో అంతస్తు నుంచి దూకినప్పుడు మలైకా తల్లి కూడా అక్కడే ఉండడం గమనార్హం.
ముంబై పోలీసుల ప్రకారం మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా మరణం ప్రాథమికంగా ఆత్మహత్యగా కనిపిస్తోంది. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమర్పించినట్లు డీసీపీ క్రైం బ్రాంచ్ రాజ్ తిలక్ రోషన్ మీడియాకు తెలిపారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు విచారణ జరుపుతున్నాయని తెలిపారు. అనిల్ మెహతా (62) ఆరవ అంతస్తులో నివసించేవాడని తెలిపారు. అయితే అతనిది ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, చనిపోవడానికి గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తన తండ్రి చనిపోయినప్పుడు నటి మలైకా అరోరా ఇంట్లో లేదు. ఆమె పూణేలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తండ్రి మరణవార్త తెలుసుకున్న ఆమె వెంటనే ముంబైకి తిరిగి వచ్చింది.
Also Read: CM Eknath Shinde : రిజర్వేషన్ల రద్దు చేయడానికి మహాయుతి అనుమతించదు