HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Maharashtra Next Cm

Maharashtra Next CM : మహారాష్ట్రలో బీజేపీ విజయం..అధిష్టానానికి తలనొప్పి

Maharashtra Next CM : మహా ప్రభంజనం ముందు ఇండియా కూటమి నిలబడలేకపోయింది. మహాయుతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది

  • Author : Sudheer Date : 23-11-2024 - 4:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maharashtra Next Cm
Maharashtra Next Cm

మహారాష్ట్ర ప్రజలు మరోసారి మహాయుతి కూటమికి బ్రహ్మరధం పట్టారు. మహారాష్ట్రలో (Maharashtra) మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగగా.. మొత్తం 4,136 మంది బరిలోకి దిగారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ, అజిత్​ పవార్​-ఎన్​సీపీ, ఏకనాధ్​ శిందే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్​, శివ సేన (యూబీటీ), ఎన్​సీపీ (శరద్ పవార్​) కలిసి మహావికాస్​ అఘాడీగా ఏర్పడ్డాయి. అయితే రాష్ట్ర ఓటర్లు (Maharashtra Election Results) మాత్రం మహాయుతి కి పట్టం కట్టారు. మహా ప్రభంజనం ముందు ఇండియా కూటమి నిలబడలేకపోయింది. మహాయుతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది.

ఈ విజయం తో బిజెపి (BJP) శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అధిష్టానానికి మాత్రం ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఎవర్ని సీఎం (Maharashtra Next CM) గా ప్రకటించాలి..? ఎవరైతే నిలబెడితే బాగుంటుంది..? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు..? పార్టీ శ్రేణులు ఎలా తీసుకుంటారు అనేది అధిష్టానానికి సవాల్ గా మారింది. లోక్ సభ ఎన్నికల్లో బిజేపీకి మహారాష్ట్రలో తక్కువ సీట్లు రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యత తీసుకోని కేవలం ఇదే నెలల్లో బిజెపి రూపురేఖలే మార్చేసి..ఈరోజు భారీ విజయం సాధించే దిశగా కష్టపడ్డారు.దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) మహాయుతి కూటమిలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే ఆయనకు పోటీగా మహాయుతి కూటమిలో ప్రస్తుత ముఖ్యమంత్రి శివసేన అధ్యక్షుడు ఏక్ నాథ్ షిండ్ (Eknath Shinde) ఉన్నారు.

దీంతో ఎన్నికల్లో విజయం సాధించినా మహాయుతి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ నెలకొంది. ఇప్పుడు తదుపరి సీఎం ఎవరు? అనేది సస్పెన్స్ గా మారింది. బిజేపీకి అత్యధిక సీట్లు రావడంతో ఫడ్నవీస్‌కే పట్టం కట్టబోతుంది అధిష్టానం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికలకు గ్రౌండ్ లెవెల్ లో బాగా ప్రచారం చేశారు. రెబెల్ అభ్యర్థులను శాంతింపచేసి, వారిని తిరిగి పార్టీ వైపునకు తీసుకువచ్చారు. సీట్ల సర్దుబాటులో కూడా బిజేపీకి మంచి డీల్ కుదిర్చారు. రెండు నెలలపాటు ఊపిరి తీసుకోకుండా ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా.. బిజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయం కట్టబెట్టారు సో ఆయనకు సీఎం పదవి ఇస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరని..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను మీడియా అడుగగా.. ఆయన మాట్లాడుతూ… “సీఎం అంశంలో ఎలాంటి వివాదాలు ఉండవని, ఎన్నికల తర్వాత మూడు పార్టీల నేతలు దీనిపై చర్చించుకోవాలని మొదటే నిర్ణయించాం. మేము తీసుకునే నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. దీనిపై ఎలాంటి వివాదం ఉండదు” అని అన్నారు. మరి అధిష్టానం ఎవరికీ కట్టబెడుతుందో చూడాలి.

Read Also : Stone Attack : చంద్రబాబుపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Devendra Fadnavis
  • Eknath Shinde
  • Maharashtra Election Results
  • Maharashtra Next CM

Related News

Tvk Bjp

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచే ఛాన్స్ ఉందా ? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏమంటుంది ?

తమిళనాడులో ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే అధికార ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సర్వే అంచనా వేసింది. మొత్తం 39 స్థానాలకు గాను ఏకంగా 38 స్థానాలను ఈ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. డీఎంకే మరియు కాంగ్రెస్ పక్షాలు తమ పట్టును ఏమాత్రం కోల్పోకుండా విపక్షాలకు నామమాత్రపు అవకాశాన్ని

  • Survey

    ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • Devendra Fadnavis On Ajit P

    మంచి మిత్రుడిని కోల్పోయాను అంటూ సీఎం ఫడణవీస్ కన్నీరు

  • Budget 2026 Updates

    కేంద్ర బడ్జెట్ పై బిజెపి కీలక నిర్ణయం

  • Ajit Pawar Plane Crash

    అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !

Latest News

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd