HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Linking Aadhaar Card With Voter Card Ec And Uidai Experts To Consult Soon

Aadhaar Voter Card Seeding: ఓటర్ ఐడీతో ఆధార్ లింక్.. ఈసీ కీలక ప్రకటన

ప్రస్తుత చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఓటర్ ఐడీతో ఆధార్‌ను(Aadhaar Voter Card Seeding) లింక్ చేస్తున్నట్లు వెల్లడించింది.

  • By Pasha Published Date - 07:04 PM, Tue - 18 March 25
  • daily-hunt
Aadhaar Voter Card Seeding Aadhaar Card Voter Card Ec Uidai Voter Id

Aadhaar Voter Card Seeding : ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు అనుసంధానంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఓటర్ ఐడీతో ఆధార్‌ను(Aadhaar Voter Card Seeding) లింక్ చేస్తున్నట్లు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 23(4), 23(5), 23(6) సెక్షన్లు, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారమే ఈ  ప్రక్రియను చేపడుతున్నట్లు ఈసీ తెలిపింది. ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేయడంతో ముడిపడిన సాంకేతిక అంశాలపై త్వరలోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI), ఈసీలకు చెందిన నిపుణులు సంప్రదింపులు జరుపుతారని ఎన్నికల సంఘం చెప్పింది. ఇదే అంశంపై చర్చించేందుకు ఇవాళ ఈసీ ఢిల్లీలో  సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, ఐటీ శాఖల కార్యదర్శులు, యూఐడీఏఐ సీఈఓ పాల్గొన్నారు.

Also Read :China Army In Pak: పాకిస్తాన్ గడ్డపైకి చైనా ఆర్మీ.. కారణం ఇదే

నకిలీ ఓటర్ల సమస్యకు అడ్డుకట్ట

ఓటరు ఐడీతో ఆధార్ కార్డును లింక్ చేస్తే నకిలీ ఓటర్ల సమస్యకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. దీనివల్ల ఓటింగ్ సరళిలో పారదర్శకత మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, రిగ్గింగ్‌ జరిగే ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియలో విశ్వసనీయతను పెంచే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని పరిశీలకులు అంటున్నారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం వల్ల వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళ్లే ముప్పు ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ ఐడీ-ఆధార్ లింక్  ప్రక్రియ ఎలా పూర్తవుతుంది ? పూర్తయ్యాక ఏం చేస్తారు ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి  ఎన్నికల సంస్కరణలను వేగవంతంగా అమలు చేస్తున్నారు. జిల్లాల స్థాయిలో ఎలక్టోరల్ అధికారులతోనూ త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతామని ఆయన గతంలోనూ ప్రకటించారు.

Also Read :Dhoni Cycle Ad : దుమ్ములేపుతున్న ధోని సైకిల్ యాడ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aadhaar card
  • Aadhaar Voter Card Seeding
  • ec
  • uidai
  • voter card
  • voter id

Related News

Rahul Vote Chori Haryana

Vote Chori : హరియాణాలో 25 లక్షల ఓట్ల చోరీ – రాహుల్

Vote Chori : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హరియాణా ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన ప్రకారం, రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగింది

  • BJP leaders in the city arrested ahead of schedule after calling for a siege of the Secretariat

    Minister Post To Azharuddin : అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!

Latest News

  • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

  • CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు

  • Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

  • RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు

  • Telangana New Cabinet : కొండా అవుట్..విజయశాంతి ఇన్ ..?

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd