Dhoni Cycle Ad : దుమ్ములేపుతున్న ధోని సైకిల్ యాడ్
Dhoni Cycle Ad : ఈ యాడ్ ప్రోమో విడుదలైన వెంటనే అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ధోని స్టైలిష్ లుక్, యానిమల్ మూడ్‌లో ఆయన కనబడటంతో ఈ యాడ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
- By Sudheer Published Date - 10:24 PM, Tue - 18 March 25

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga).. యాడ్ ఫిల్మ్ రంగంలోనూ తన సత్తా చూపిస్తున్నారు. బాలీవుడ్‌లో “యానిమల్” వంటి సంచలన విజయాన్ని అందుకున్న సందీప్, ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ (MSDHONI) తో కలిసి ఓ ఎలక్ట్రిక్ సైకిల్ యాడ్ (Dhoni Cycle Ad) డైరెక్ట్ చేశారు. ఈ యాడ్ ప్రోమో విడుదలైన వెంటనే అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ధోని స్టైలిష్ లుక్, యానిమల్ మూడ్‌లో ఆయన కనబడటంతో ఈ యాడ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Shark Tank Show : ‘షార్క్’గా మారిన తెలుగు వ్యాపారవేత్త.. శ్రీకాంత్ బొల్లా గ్రేట్
యాడ్‌లో ధోని స్టైలిష్ లుక్ తో కనిపించాడు. వరుసగా నాలుగు కార్లు రయ్ రయ్ మంటూ రావడం, ఆ కార్లలోంచి ధోని బ్లూ కోట్, బ్లాక్ గాగుల్స్ తో లైమ్ లైట్ లోకి ఎంట్రీ ఇవ్వడం అభిమానుల్లో జోష్ నింపింది. అనంతరం ఎలక్ట్రిక్ సైకిల్ నడుపుతూ ధోని కూల్ లుక్ లో దర్శనమిచ్చారు. యాడ్ చివర్లో సందీప్ రెడ్డి వంగా “కట్.. కట్” అంటూ స్టైల్‌గా రియాక్షన్ ఇవ్వడం, “ఫెంటాస్టిక్” అంటూ కామెంట్ చేయడం మైండ్ బ్లోయింగ్ మూమెంట్ గా నిలిచింది.
ఈ యాడ్ ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ధోని ఇంతకు ముందెప్పుడూ ఇలా ఒక సినిమాని అనుసరిస్తూ యాడ్ చేయలేదు. మొదటిసారి “యానిమల్” మూవీ లాస్ట్ షాట్ ని ఇమిటేట్ చేయడంతో క్రికెట్, సినిమా ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. ధోని ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ వీడియో నెట్టింట దూసుకెళ్తోంది.
Animal For A Reason 😉@e_motorad @msdhoni pic.twitter.com/pNhBrJkXi2
— Sandeep Reddy Vanga (@imvangasandeep) March 18, 2025