Uniform Civil Code : యూసీసీపై కేంద్రం కీలక ప్రకటన.. విధివిధానాల ప్రశ్నే తలెత్తదని వెల్లడి
Uniform Civil Code : యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నందున, దానికి సంబంధించిన విధివిధానాల ప్రశ్నే తలెత్తదని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు.
- Author : Pasha
Date : 21-07-2023 - 7:10 IST
Published By : Hashtagu Telugu Desk
Uniform Civil Code : యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నందున, దానికి సంబంధించిన విధివిధానాల ప్రశ్నే తలెత్తదని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు రాజ్యసభలో యూసీసీపై నాలుగు ప్రశ్నలు వచ్చాయి. యూసీసీపై(Uniform Civil Code) చర్చలో లా కమిషన్ జోక్యంపై పలువురు రాజ్యసభ సభ్యులు ప్రభుత్వ వివరణ కోరారు. ‘కుటుంబ చట్ట సంస్కరణ’పై 21వ లా కమిషన్ నాలుగేళ్ల క్రితమే సంప్రదింపులు జరిపినప్పటికీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించలేదన్నారు. అందుకే 22వ లా కమిషన్ యూసీసీ ఔచిత్యం, ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అభిప్రాయాలను సేకరిస్తోందని వివరించారు.
Also read : Blasts In Pakistan: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. పోలీసు మృతి, ఎనిమిది మందికి గాయాలు
కర్ణాటక మాజీ ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని 22వ లా కమిషన్ యూసీసీపై ప్రజలు, వివిధ మత సంస్థల అభిప్రాయాన్ని జూన్ 14 నుంచి ఆహ్వానించింది. అనూహ్య స్పందనను చూసి ఈ నెల 14న ముగిసిన గడువును మరో రెండు వారాల పాటు పొడిగించింది. లింగం, కులం, మతం తదితర అంశాల్లో చట్టం ముందు అందరూ సమానమేనని, యూసీసీ ఆకృతిని దానికి అనుగుణంగానే రూపొందిస్తామని మంత్రి సూచనప్రాయంగా చెప్పారు.
Also read : Project K Glimpse : ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ వచ్చేసింది.. అదిరిపోయిన విజువల్స్.. హాలీవుడ్ ని మించి..