Project K Glimpse : ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ వచ్చేసింది.. అదిరిపోయిన విజువల్స్.. హాలీవుడ్ ని మించి..
హాలీవుడ్ లో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కె (Project k) చిత్రయూనిట్ పాల్గొంది. తాజాగా సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.
- By News Desk Published Date - 01:41 AM, Fri - 21 July 23

Project K Glimpse : ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో గ్రాండ్ గా దాదాపు 500 కోట్లతో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె (Project K). ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని.. ఇలా అనేకమంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.
హాలీవుడ్ లో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్ (Comic Con Event) లో ప్రాజెక్ట్ కె (Project K) చిత్రయూనిట్ పాల్గొంది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K చరిత్ర సృష్టించింది. ఈ ఈవెంట్ లో ప్రభాస్, కమల్ హాసన్, చిత్రయూనిట్ పాల్గొని తాజాగా సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ప్రాజెక్ట్ కె టైటిల్ ని కల్కి (Kalki) అని ప్రకటించారు. టైటిల్ కింద 2898 AD అని రాశారు. అంటే ఈ కథ ఆ సంవత్సరంలో జరుగుతుందని తెలుస్తుంది. ఇక గ్లింప్స్ లో కలియుగం అంతానికి వచ్చినట్టు విలన్ ప్రజల్ని దారుణంగా పరిపాలిస్తుంటే దేవుడు కల్కి వచ్చినట్టు, ప్రపంచాన్ని కాపాడబోతున్నట్టు చూపించారు.
𝐏𝐑𝐎𝐉𝐄𝐂𝐓-𝐊 is now #Kalki2898AD 💥
Here's a small glimpse into our world: https://t.co/3vkH1VpZgP#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
ఈ గ్లింప్స్ చూశాక ప్రాజెక్ట్ కె (కల్కి) సినిమాపై ఒక్కసారిగా భారీగా అంచనాలు పెరిగాయి. గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ప్రభాస్ వరుసగా బాహుబలి తర్వాత అన్ని ఫ్లాప్స్ పడుతుండటంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ సినిమాపై కూడా అనుమానం ఉండేది. కానీ గ్లింప్స్ చూశాక ఇది కచ్చితంగా హాలీవుడ్ రేంజ్ లో హిట్ అవుతుందని, సినిమా అదిరిపోతుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం 2024 లో రిలీజ్ చేయనున్నారు.
Also Read: Rice Export: బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం