Aliens : ఏలియన్లు ఉన్నమాట నిజమే.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సంచలన కామెంట్స్
భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఏలియన్స్(Aliens) ఉండి ఉండొచ్చు. ఉదాహరణకు గత వందేళ్లలో భూమిపై ఉన్న మానవులతో పాటు విశ్వంలో ఉన్న అన్ని జీవులు అభివృద్ధి చెంది ఉంటాయి.
- By Pasha Published Date - 01:51 PM, Mon - 26 August 24

Aliens : ఏలియన్స్ గురించి ఎవరో చెబితే మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వాటి గురించి మాట్లాడారు. ఏలియన్స్ ఉన్నమాట నిజమేనని ఆయన కామెంట్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా పాడ్ కాస్ట్లో సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
‘‘భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఏలియన్స్(Aliens) ఉండి ఉండొచ్చు. ఉదాహరణకు గత వందేళ్లలో భూమిపై ఉన్న మానవులతో పాటు విశ్వంలో ఉన్న అన్ని జీవులు అభివృద్ధి చెంది ఉంటాయి. మానవుడి కంటే కొన్ని జీవరాశులు టెక్నాలజీలో చాలా ముందు కూడా ఉన్నాయో. భూమిపై కాకుండా వేరే చోట ఏవైనా జీవరాశులు 1000 సంవత్సరాలు అడ్వాన్సుగా, 1000 సంవత్సరాలు వెనుకబడి ఉండొచ్చు’’ అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు.భూమిపై ఉన్న జీవులతో పోలిస్తే ఏలియన్స్ భిన్నంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏలియన్ల శరీరం జినోమిక్, ప్రోటీన్‌తో నిర్మితమై ఉండొచ్చన్నారు. అందుకే మానవులు, ఏలియన్స్ మధ్య సంఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇస్రో చీఫ్ అభిప్రాయపడ్డారు.
ఏలియన్ల గురించి కొన్ని విషయాలను తమ దేశం దాచిపెడుతోందని అమెరికా మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు అమెరికా కాంగ్రెస్‌కు ఆయన కొన్ని సాక్ష్యాలను సమర్పించారు. 1930వ దశకం నుంచే ఏలియన్లకు సంబంధించిన చాలా సమాచారాన్ని అమెరికా సేకరించిందని డేవిడ్ గ్రుష్ తెలిపారు. అయితే గ్రుష్ వ్యాఖ్యలను అమెరికా రక్షణ శాఖ తోసిపుచ్చింది. అమెరికా ప్రభుత్వ పరిశోధకులకు గ్రహాంతర వాసుల గురించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేసింది. ఏదిఏమైనప్పటికీ ఏలియన్లు అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది. ప్రజలకు కూడా వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది.