Manish Sisodia : గవర్నర్ పదవిపై మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు
దేశ ప్రజాస్వామ్యంపై గవర్నర్ పదవి గుదిబండగా మారిందంటూ తీవ్ర విమర్శలు..
- By Latha Suma Published Date - 11:24 PM, Wed - 14 August 24

Manish Sisodia: గవర్నర్ పదవి( Governor post)పై ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాల పని తీరుకు గవర్నర్లు ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఆ పదవి ప్రజాస్వామ్యానికి భారమని.. దాన్ని రద్దు చేయడమే మేలు అన్నారు. ప్రముఖ జాతీయ మీడియా వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”ఎన్నికైన నాయకులు, గవర్నర్‌కు మధ్య జరుగుతున్న వాగ్వాదం కారణంగా ఢిల్లీలోని బ్యూరోక్రాట్లు ఇబ్బంది పడుతున్నారు. ఎల్జీకి, ఢిల్లీ ప్రభుత్వానికి జరుగుతున్న ఈ వాగ్వాదం ప్రజాస్వామ్యానికి హానికరంగా మారుతోంది. ప్రస్తుతం అధికారంలోని ప్రభుత్వ హక్కులను కేంద్రం కాలరాస్తోంది. గవర్నర్ పదవి అసలు ఎందుకు?ఎన్నికైన నాయకులతో ప్రమాణం చేయించడానికేనా..? ఆ పని ఇతరులు కూడా చేయవచ్చు. ఆ పదవి ప్రజాస్వామ్యానికి భారం. దాన్ని రద్దు చేయడమే మేలు” అని సిసోదియా అభిప్రాయపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
బీజేపీయేతర ప్రభుత్వాల పనిని అడ్డుకోవడమే లక్ష్య్ంగా తమకు అనుకూల గవర్నర్లను నియమిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలోని ఎల్జీ పాత్రను తొలగిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. కాగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా ఇటీవల జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తిహాడ్ జైలు నుంచి 17 నెలల తర్వాత బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన గవర్నర్ పదవిపై ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ!