Cauvery Water : కావేరి జల’రగడ’ – నేడు కర్ణాటక బంద్
రక్తం అయినా ఇస్తాము కాని తమిళనాడుకు కావేరీ నీళ్లు ఇవ్వలేమనే నినాదాలతో కర్ణాటక దద్దరిల్లుతున్నది.
- Author : Sudheer
Date : 29-09-2023 - 11:12 IST
Published By : Hashtagu Telugu Desk
కావేరి జల వివాదం (Cauvery Water Sharing Issue) రోజు రోజుకు మరింత ఉదృతం అవుతుంది. కర్ణాటక ప్రజలు అటు తమిళనాడు ప్రజలు ఎక్కడ తగ్గడం లేదు. 15 రోజుల పాటు కావేరీ నది నుంచి తమిళనాడు (Tamilanadu)కు నీరు విడుదల చేయాలని కావేరీ బోర్డు (Cauvery Board) ఆదేశాలు ఇవ్వడంతో కన్నడిగులు భగ్గుమంటున్నారు. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయవద్దంటూ.. బెంగళూరు వ్యాప్తంగా మంగళవారం బంద్ (Bengaluru bandh)కు పిలుపునివ్వగా..నేడు కర్ణాటక బంద్ (Karnataka Bandh) కు పిలుపునిచ్చింది. రక్తం అయినా ఇస్తాము కాని తమిళనాడుకు కావేరీ నీళ్లు ఇవ్వలేమనే నినాదాలతో కర్ణాటక దద్దరిల్లుతున్నది.
కర్ణాటక బంద్ (karnataka bandh)సందర్బంగా బెంగళూరు నగర శివార్లలోని దేవనహళ్లి సమీపంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంకు విమానాల (Airport) రాకపోకలు నిలిచిపోవడంతో ఎయిర్ పోర్టు ఖాళీగా దర్శనం ఇస్తుంది. నిత్యం విమానాలు (Airport), క్యాబ్ లు, ట్యాక్సీలు, ప్రయాణికులతో కిటకిటలాడే విమానాశ్రయం బోసిపోయింది. కర్ణాటక బంద్ సందర్బంగా విమానాల్లో (Airport) బెంగళూరు (Bengaluru)రావడానికి ప్రయాణికులు ఆసక్తి చూపించకపోవడంతో 44 విమాన సర్వీసులు రద్దు చేశారని కన్నడ మీడియా తెలిపింది. నమ్మ బెంగళూరు (Bengaluru) మెట్రో రైలులో ప్రయాణికులు అంతంతమాత్రంగానే దర్శనం ఇచ్చారు. ఇక కర్ణాటక (karnataka bandh) అనుబంధ సంస్థలు అయిన కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సులు శుక్రవారం ఉదయం డిపోల నుంచి బయటకు వచ్చాయి.
Read Also : M.S. Swaminathan : స్వామినాథన్.. నీకు దేశమే రుణపడింది