JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్ష ఫలితాలు (Results) నేడు విడుదలయ్యాయి. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ,
- By Maheswara Rao Nadella Published Date - 11:39 AM, Tue - 7 February 23

జేఈఈ మెయిన్ (JEE Main) తొలి సెషన్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశానికి సంబంధించి జాయిట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మొయిన్ (JEE Main) తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు జరిగాయి. జేఈఈ చరిత్రలోనే తొలిసారి 95.8 శాతం మంది అంటే 8.22 లక్షల మంది హాజరయ్యారు.
తాజాగా, జాతీయ పరీక్షల సంస్థ (NTA) వీటి ఫలితాలను విడుదల చేసింది. jeemain.nta.nic.in లేదంటే ntaresuts.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ నంబరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా, జేఈఈ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 12 వరకు జరగనున్నాయి. సెకండ్ సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారాన్ని https://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల సిటీ స్లిప్‌లను మార్చి 3న విడుదల చేయనుండగా, చివరి వారంలో అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు.
Also Read: Plane Accident: టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్ లో మంటలు..

Related News

Women’s World Boxing Championship: నలుగురి పంచ్ బంగారమాయె
మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు అదరగొట్టారు. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకున్నారు.