HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >It Is The Almighty Who Has Guided Me To Do What I Am Doing Says Gautam Adani

Gautam Adani : ‘‘ఆ దేవుడు ఆదేశించాడు.. ఈ అదానీ పాటించాడు’’ : గౌతం అదానీ

మిలియన్ల మంది ప్రజలకు సేవ చేయగల  అద్భుతమైన డెలివరీ వ్యవస్థ ఇస్కాన్‌కు ఉంది’’ అని గౌతం అదానీ(Gautam Adani)  కొనియాడారు.

  • By Pasha Published Date - 08:29 PM, Sun - 12 January 25
  • daily-hunt
Gautam Adani Iskcon Ahmedabad Gujarat Adani Group 

Gautam Adani : అదానీ గ్రూప్ అధినేత, ప్రముఖ బిలియనీర్ గౌతం అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ దేవుడు ఆదేశించాడు.. ఈ అదానీ పాటించాడు’’ అని సేవా కార్యక్రమాల విషయంలో తాను ఇటీవలే తీసుకున్న నిర్ణయాల గురించి ఆయన వెల్లడించారు. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘ఇస్కాన్’ సంస్థ గవర్నింగ్ బాడీ కమిషన్ ఛైర్మన్ గురుప్రసాద్ స్వామి మహరాజ్‌తో గౌతం అదానీ భేటీ అయ్యారు.  ఈసందర్భంగా ఇద్దరూ సంభాషించుకున్నారు. ఈక్రమంలో గౌతం అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు.

#WATCH | Ahmedabad, Gujarat: Adani Group Chairman, Gautam Adani met Guru Prasad Swami Maharaj, Chairman, Governing Body Commission of ISKCON today.

The Adani Group and ISKCON have joined hands to serve meals to devotees at the Maha Kumbh Mela in Prayagraj this year. The… pic.twitter.com/AdQmoplZ7a

— ANI (@ANI) January 9, 2025

నా యోగ్యత వల్ల ఇక్కడకు చేరుకోలేదని అనిపిస్తుంది

‘‘నేను చాలా సాధారణ కుటుంబానికి చెందినవాడిని. మనం ఏ స్థానానికి చేరుకున్నా వచ్చిన చోటును మర్చిపోకూడదు. కొన్నిసార్లు నేను కళ్ళు మూసుకున్నప్పుడు, నా సొంత యోగ్యత వల్ల నేను ఇక్కడకు చేరుకోలేదని అనిపిస్తుంది. నేనేం చేసినా.. దేవుడి ఆదేశం వల్లే చేస్తుంటాను.  అందుకే నాకు డబ్బు, ఇతర వస్తువులు చాలా చిన్నగా అనిపిస్తుంటాయి’’ అని గౌతం అదానీ చెప్పుకొచ్చారు. ‘‘సమాజానికి సేవ చేసే విషయంలో అదానీ గ్రూప్ ఎన్నడూ వెనుకాడదు. ఈ అంశంలో మేం ఇస్కాన్ సాయం తీసుకుంటాం. ఇది మాకు చాలా ప్రతిష్ఠాత్మకమైన అంశం. మిలియన్ల మంది ప్రజలకు సేవ చేయగల  అద్భుతమైన డెలివరీ వ్యవస్థ ఇస్కాన్‌కు ఉంది’’ అని గౌతం అదానీ(Gautam Adani)  కొనియాడారు.

Also Read :Nuclear Engineers Kidnapped : 16 మంది న్యూక్లియర్ ఇంజినీర్లు కిడ్నాప్.. పాక్‌లో కలకలం

గీతా ప్రెస్, అదానీ గ్రూప్ కలిసి..

గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. “మహా కుంభమేళా అనేది భారతీయ సంస్కృతి, మత విశ్వాసం యొక్క గొప్ప యాగం! ఈ మహాయజ్ఞంలో ప్రతిష్ఠాత్మకమైన సంస్థ గీతా ప్రెస్‌ సహకారంతో మేళాకు వచ్చే భక్తులకు కోటి ‘ఆరతి సేకరణ’ కాపీలను ఉచితంగా పంపిణీ చేయనున్నాం. ఇది మాకు ఎనలేని సంతృప్తిని కలిగించే విషయం’’ అని అదానీ వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో రేపటి (సోమవారం) నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాలో భక్తులకు భోజన ఏర్పాట్లు చేసేందుకు ఇస్కాన్ సంస్థతో అదానీ గ్రూప్ చేతులు కలిపింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది.

Also Read :Wife Vs Sundays : భార్యలు వర్సెస్ సండేస్.. తన భార్యను ప్రస్తావిస్తూ అదర్ పూనావాలా రియాక్షన్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • adani
  • Adani group
  • ahmedabad
  • gautam adani
  • gujarat
  • ISKCON

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd