ISRO vs SUPARCO: ఇండియా ఇస్రో వర్సెస్ పాక్ సుపార్కో
ప్రపంచ దేశాలు భారత్ గురించే చర్చిస్తున్నాయి. ఇస్రో సృష్టించిన అద్భుత విజయం ప్రపంచ చరిత్రలో సరికొత్త అధ్యాయం. అమెరికా, రష్యా, చైనా చేయలేని పనిని భారత్ చేసింది
- By Praveen Aluthuru Published Date - 05:27 PM, Sat - 26 August 23

ISRO vs SUPARCO: ప్రపంచ దేశాలు భారత్ గురించే చర్చిస్తున్నాయి. ఇస్రో సృష్టించిన అద్భుత విజయం ప్రపంచ చరిత్రలో సరికొత్త అధ్యాయం. అమెరికా, రష్యా, చైనా చేయలేని పనిని భారత్ చేసింది. అయితే ఈ మిషన్ పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది. చంద్రయాన్-3 జాబిల్లిని ముద్దాడటంతో ఇప్పుడు పాక్ స్పేస్ ఏజెన్సీపై అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇస్రో కంటే ముందే పాకిస్తాన్‌లో అంతరిక్ష సంస్థ స్థాపించబడింది. పాకిస్థాన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (SUPARCO) 16 సెప్టెంబర్ 1961న స్థాపించబడింది. ఇస్రో (ISRO) 1969లో స్థాపించారు. ఇస్రో కంటే ముందే సుపార్కో 1962లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించింది. దీని తరువాత ఇస్రో నెమ్మదిగా తమ ప్రయోగాన్ని ప్రారంభించింది. కానీ ఇన్నాళ్లయినా పాక్ తమ రాకెట్ ని జాబిల్లికి చేర్చలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వం తమ స్పేస్ ఏజెన్సీపై శ్రద్ధ చూపకపోవడమే దీనికి అతిపెద్ద కారణం.
62 ఏళ్ల అంతరిక్ష సంస్థ చరిత్రలో పాకిస్థాన్ కేవలం 5 ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించింది. మొదటి ఉపగ్రహాన్ని 19 జూలై 1990న ప్రయోగించారు, దీనికి బదర్ 1 అని పేరు పెట్టారు. ఈ ఉపగ్రహం 6 నెలలు మాత్రమే పని చేస్తుంది. దీని తరువాత, రెండవ ఉపగ్రహాన్ని 10 డిసెంబర్ 2001న ప్రయోగించారు, దీనికి బద్ర్-బి అని పేరు పెట్టారు.
మూడవ PAKAT-1 చైనా సహాయంతో 11 ఆగస్టు 2011న ప్రయోగించబడింది. నాల్గవ ఉపగ్రహం iCube-1 21 నవంబర్ 2013న ప్రయోగించబడింది. చైనా సహాయంతో 9 జూలై 2018న పాకిస్తాన్ చివరి మరియు ఐదవ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ తర్వాత పాకిస్థాన్ ఎలాంటి ప్రయోగాలు చేయలేదు.
Also Read: Mynampally Hanumanth Rao: యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది: మైనంపల్లి హన్మంతరావు