Isckon Employee Fled : రూ.లక్షల విరాళాలతో బిచాణా ఎత్తేసిన ఇస్కాన్ ఉద్యోగి
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న ఇస్కాన్ ఆలయ ఉద్యోగి(Isckon Employee Fled) ఒకరు లక్షలాది రూపాయలు విలువైన డొనేషన్ల డబ్బుతో బిచాణా ఎత్తేశాడు.
- By Pasha Published Date - 11:46 AM, Sun - 5 January 25

Isckon Employee Fled : హిందూ ఆధ్యాత్మిక, ధార్మిక అంశాలపై ప్రచారం చేసే విషయంలో ఇస్కాన్ సంస్థ ప్రపంచ ఖ్యాతిని గడించింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాఖలు, ఆలయాలు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇస్కాన్ కీలక పాత్ర పోషిస్తోంది. క్రమశిక్షణ, నైతిక విలువలకు ఇస్కాన్ మారుపేరు. ఎంతోమందికి ఇస్కాన్ సంస్థ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తోంది.
Also Read :Polished Rice : డబుల్ పాలిష్డ్ బియ్యం వాడుతున్నారా ? బీ అలర్ట్ ‘బెరిబెరి’!
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న ఇస్కాన్ ఆలయ ఉద్యోగి(Isckon Employee Fled) ఒకరు లక్షలాది రూపాయలు విలువైన డొనేషన్ల డబ్బుతో బిచాణా ఎత్తేశాడు. అతడి పేరు.. మురళీధర్ దాస్. ఇండోర్ నగరానికే చెందిన నీమాయ్ చంద్ యాదవ్ కుమారుడు. మురళీధర్ దాస్‌పై ఇస్కాన్ ఆలయ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ విశ్వ నామ్ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇస్కాన్ తరఫున ఇండోర్‌లో చందాలు వసూలు చేసి, వాటిని బ్యాంకు అకౌంటులో డిపాజిట్ చేసే విధులను మురళీధర్ నిర్వర్తించేవాడని తెలిపారు. దాదాపు 32 షీట్లతో కూడిన ఇస్కాన్ ఆలయ చందాల పుస్తకం, లక్షలాది రూపాయల చందా డబ్బుతో మురళీధర్ పారిపోయాడని ఫిర్యాదులో ప్రస్తావించారు.
Also Read :Male Suicides : పురుషుల సూసైడ్స్ కలకలం.. ప్రధాన కారణాలు ఇవేనంట !
ప్రస్తుతం పరారీలో ఉన్న మురళీధర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇస్కాన్ ఆలయానికి చెందిన ఎంత డబ్బును అతడు తీసుకెళ్లాడు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇండోర్‌లోని ఇస్కాన్ ఆలయంలో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకుముందు ఈ ఆలయంలో చందాల వ్యవహారాలను సౌరవ్ అనే ఉద్యోగి చూసేవాడు. గతంలో అతడు కూడా భక్తులు ఇచ్చిన చందాల డబ్బులు, చందా పుస్తకంతో పారిపోయాడు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు అతడి డెడ్‌బాడీని గుర్తించారు. డబ్బును రికవర్ చేశారు.