Rail Tracks : రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు.. మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర
రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లు ఉండటంతో పట్టాల మధ్యలో రైలుకు సిగ్నల్ (Rail Tracks) అందలేదు.
- By Pasha Published Date - 01:44 PM, Mon - 23 September 24

Rail Tracks : మరో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్‌లు పెట్టారు. లోక్ పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు పంజాబ్‌లోని భటిండా-ఢిల్లీ రైల్వే ట్రాక్‌పై చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
Also Read :Child Pornographic Material : ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం నేరమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లు ఉండటంతో పట్టాల మధ్యలో రైలుకు సిగ్నల్ (Rail Tracks) అందలేదు. దీంతో ట్రైన్ చాలా ఆలస్యమైంది. ఇప్పటి వరకు 9 ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు.ఈవిధంగా ఇనుప రాడ్లు పెట్టడం ద్వారా రైలు ప్రమాదానికి ఎవరైనా కుట్రపన్నారా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈనెలలో రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువులు దొరకవడం ఇది నాలుగోసారి. ఈ వరుస ఘటనలతో రైలు ప్రయాణికుల్లో ఆందోళన పెరుగుతోంది. రైల్వేశాఖకు కేంద్ర ప్రభుత్వం ఏటా వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తోంది. అయినా రైలు ప్రమాదాలు ఆగడం లేదు. గతంలో ఒడిశాలో రైల్వే సిగ్నలింగ్ లోపంతో జరిగిన ఘోర ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైల్వేల విస్తరణ కంటే.. అందుబాటులో ఉన్న రైల్వే లైన్లలో నాణ్యమైన సేవలను అందించడంపై ఫోకస్ చేస్తే బాగుంటుంది.
Also Read :Gandhi Hospital Deaths: గాంధీ ఆసుపత్రిలో శిశు మరణాలపై త్రిసభ్య కమిటీ: కేటీఆర్
- సెప్టెంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఉన్న ఓ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై సిలిండర్‌ను అధికారులు గుర్తించారు. లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది.
- ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 18సార్లు రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరిగాయని సెప్టెంబరు 10న రైల్వేశాఖ సంచలన ప్రకటన చేసింది.
- 2023 జూన్ నుంచి ఇప్పటి వరకు రైల్వే ట్రాక్‌లపై సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్‌లు, సిమెంట్ దిమ్మలు వంటి వస్తువులు కనిపించిన 24 ఘటనలు చోటుచేసుకున్నాయి.