Iron Rod Vs Infant: 30 రోజుల పసికందుకు ఇనుప చువ్వలతో 40 వాతలు.. ఏమైంది ?
‘‘ఆ పసికందు శరీరంపై 40 దాకా వాతలను(Iron Rod Vs Infant) మేం గుర్తించాం.
- By Pasha Published Date - 03:44 PM, Mon - 3 March 25

Iron Rod Vs Infant: నెల రోజుల పసికందు అని కూడా చూడకుండా వేడివేడి ఇనుక కడ్డీలతో.. ఆ శిశువు బొడ్డు, తల భాగాల్లో వాతలు పెట్టారు. గుక్క తిప్పుకోకుండా చిన్నారి ఏడుస్తున్నా వాతలు పెట్టడాన్ని ఆపలేదు. 30 రోజుల శిశువుకు ఏకంగా 30 నుంచి 40 వాతలు పెట్టారు. ఈ అమానుష, అనాగరిక ఘటన వివరాలివీ..
Also Read :Immediately Have Babies: అర్జెంటుగా పిల్లల్ని కనమంటున్న సీఎం.. ఎందుకో తెలుసా ?
ఫుండేల్ పాడాలో..
ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లా గంభారిగూడ గ్రామ పంచాయితీ పరిధిలోని ఫుండేల్ పాడా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 40 వాతలు పెట్టాక ఆ పసికందు ఆరోగ్యం బాగా దెబ్బతింది. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఉమర్ కోట్ సబ్ డివిజనల్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు అత్యవసర చికిత్సను అందించి, పిల్లాడి ప్రాణాన్ని కాపాడారు. ప్రస్తుతం ఆ బాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని నబరంగ్ పూర్ జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ పాండా వెల్లడించారు. ఆ బాబును తాను స్వయంగా పరామర్శించినట్లు ఆయన తెలిపారు.
Also Read :A Prostitute Story : ఆస్కార్‌లో ‘పంచ్’ విసిరిన వేశ్య కథ.. ‘అనోరా’ స్టోరీ ఇదీ
ఏదైనా దుష్ట శక్తి ప్రభావం వల్లే..
‘‘ఆ పసికందు శరీరంపై 40 దాకా వాతలను(Iron Rod Vs Infant) మేం గుర్తించాం. వాతలు పెడితే పిల్లలను రోగాలు దరిచేరవు అనే మూఢనమ్మకంలో భాగంగా ఈ విధంగా చేశారు’’ అని డాక్టర్ సంతోష్ కుమార్ పాండా చెప్పారు. ‘‘పదిరోజుల క్రితం ఆ శిశువుకు తీవ్ర జ్వరం వచ్చింది. ఏదైనా దుష్ట శక్తి ప్రభావం వల్లే అలా జరిగి ఉండొచ్చని తల్లిదండ్రులు భావించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకపోగా.. ఇనుప చువ్వలను వేడి చేసి శిశువుకు 40 వాతలు పెట్టారు. దీంతో ఆ బుజ్జాయి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు’’ అని డాక్టర్ వివరించారు. నేటికీ మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలపై మూఢనమ్మకాల ప్రభావం తగ్గలేదు. మూఢ నమ్మకాలను విడనాడేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. రాజకీయ పార్టీలు విమర్శలతో కాలక్షేపం చేసేకన్నా.. ఇలాంటి సామాజిక అంశాలపై పోరాడితే బాగుంటుంది. వాటికి జనాదరణ కూడా పెరుగుతుంది.