RBI: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు.
- By Balu J Published Date - 11:17 AM, Fri - 8 December 23

RBI: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఐదోసారి. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. 2023 సంవత్సరం ముగింపునకు వచ్చిన వేళ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయని, కానీ, ఆహార ద్రవ్యోల్బణంలో మాత్రం రిస్క్ ఇంకా కొనసాగుతోంది ఆయన స్పస్టం చేశారు. దేశ జీడీపీ (GDP) వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగిందని ఆయన అన్నారు.
Also Read: Congress Govt: ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే మా లక్ష్యం : వీహెచ్