HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Indian Army Showcases Futuristic Robotic Mules During Rehearsals In Pune

Futuristic Robotic Mules : ఆర్మీ రోబోలు ఇవిగో.. ఆర్మీ డే పరేడ్‌తో బరిలోకి.. ఇవేం చేస్తాయంటే ?

‘ఆర్క్‌వీ మ్యూల్’  రోబోలను(Futuristic Robotic Mules) సైనిక పహారా కోసం వాడుతారు.

  • By Pasha Published Date - 02:40 PM, Wed - 15 January 25
  • daily-hunt
Indian Army Futuristic Robotic Mules Pune Army Day 2025

Futuristic Robotic Mules : రోబోలు మన సైన్యంలోకి ఎంట్రీ ఇచ్చాయి. నాలుగు పాదాలతో కూడిన Q-UGV రోబోలను మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించిన భారత ఆర్మీ డే పరేడ్‌లో ప్రదర్శించారు.  బాంబే ఇంజినీరింగ్ గ్రూప్ (BEG)నకు చెందిన పరేడ్ మైదానం వేదికగా ఈ పరేడ్ జరిగింది. ఇప్పటివరకు AeroArc Pvt Ltd కంపెనీ నుంచి భారత సైన్యం దాదాపు 100కుపైగా రోబోలను కొనుగోలు చేసింది. వీటి పేరు.. ‘ఆర్క్‌వీ మ్యూల్’.  ఈ రోబోలను సైనికులు రిమోట్‌‌తో ఆపరేట్ చేయొచ్చు. స్వయం ప్రతిపత్తితోనూ అవి పనిచేయగలవు. ఇంతకీ ఈ రోబోలు ఎలా పనిచేస్తాయి ? వీటి ప్రత్యేకతలు ఏమిటి ? అనేది ఈ కథనంలో చూద్దాం..

#WATCH | Maharashtra | Visuals of the 77th Army Day Parade in Pune.

The Army Day Parade commemorates Field Marshal KM Cariappa’s appointment as the first Indian Commander-in-Chief of the Indian Army in 1949, symbolizing India’s post-independence military leadership. pic.twitter.com/JRoDiNwED3

— ANI (@ANI) January 15, 2025

Also Read :Three Warships Commissioned : ‘‘వికాసం కావాలి.. విస్తరణ కాదు’’.. మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితమిచ్చిన మోడీ

ఎందుకీ పరేడ్ ?

భారత సైన్యానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్‌గా ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియప్పను 1949 సంవత్సరం జనవరి 15న  నియమించారు. బ్రిటీషర్ల చివరి కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా ఎఫ్ఆర్ఆర్ బుచర్ నుంచి కరియప్ప బాధ్యతలను స్వీకరించారు. ఆ చారిత్రక రోజును గుర్తు చేసుకుంటూ ఏటా జనవరి 15న ఆర్మీ డే పరేడ్‌ను నిర్వహిస్తుంటారు.

Also Read :Skill Development Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట

ఈ రోబోలు ఏం చేస్తాయి ?

  • ‘ఆర్క్‌వీ మ్యూల్’  రోబోలను(Futuristic Robotic Mules) సైనిక పహారా కోసం వాడుతారు.
  • ఇరుకైన ప్రదేశాల్లో ఉగ్రవాదులు, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లను నిర్వహించే క్రమంలో వీటిని వాడుతారు.
  • రసాయన సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు భద్రతా చర్యల కోసం ఈ రోబోలను మోహరిస్తారు.
  • బయొలాజికల్ దాడులు జరిగినప్పుడు, న్యూక్లియర్ పదార్థాల పేలుళ్లు సంభవించినప్పుడు ఈ రోబోలను వాడుతారు.
  • బాంబులను నిర్వీర్యం చేసేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి.

రోబోలోని విశేషాలు..

  • ‘ఆర్క్‌వీ మ్యూల్’ రోబోలో కంప్యూట్ బాక్స్‌ అనే భాగం ఉంటుంది. ఇది ఈ రోబోలో మెదడులా పనిచేస్తుంది.
  • ఈ రోబోలోని బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 20 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది.
  • ఈ రోబో బరువు 51 కేజీలు. ఇది సెకనుకు 3 మీటర్ల వేగంతో నడుస్తుంది.
  • ఈ రోబో 12 కేజీల బరువును మోయగలదు.
  • చిన్నపాటి తుపాకులు, కెమెరాలు, డ్రోన్లను ఇది మోసుకెళ్లగలదు.
  • ఇది మెట్లు ఎక్కగలవు. కొండప్రాంతాల్లో, బురద నేలల్లో నడవగలదు.
  • మైనస్ 40 డిగ్రీల చలిలో, 55 డిగ్రీల ఎండల్లోనూ ఈ రోబో పనిచేయగలదు.
  • ఈ రోబోలలో ఎన్‌విడియా జేవియర్ ప్రాసెసర్ ఉంటుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd