India Vs Pakistan : ‘సిందూరం’ పవర్‌ను చూపించాం.. పాక్‌కు చుక్కనీళ్లూ ఇవ్వం : ప్రధాని మోడీ
‘‘భారత సేనలు చేసిన దాడి దెబ్బకు పాకిస్తాన్(India Vs Pakistan)లోని రహీంయార్ ఖాన్ ఎయిర్‌బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది.
- By Pasha Published Date - 03:04 PM, Thu - 22 May 25

India Vs Pakistan : ‘ఆపరేషన్ సిందూర్’ గురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సిందూరం’ భగ్గుమంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్‌కు చూపించామని ఆయన చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా 22 నిమిషాల్లోనే పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామన్నారు. పాకిస్తాన్ ఆర్మీని భారత భద్రతా బలగాలు కొన్ని గంటల్లోనే మోకాళ్లపై కూర్చోబెట్టాయని పేర్కొన్నారు. ఉగ్రమూకలను మట్టిలో కలిపామని మోడీ తెలిపారు. తన సిరల్లో రక్తం కాదు సిందూరం ప్రవహిస్తోందని ఆయన చెప్పారు. భారత ప్రజల జోలికొస్తే పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం తప్పదని మోడీ హెచ్చరించారు. రాజస్థాన్‌లోని బికనీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఈ కామెంట్స్ చేశారు.
Also Read :IFS Toppers 2025: ఐఎఫ్ఎస్ ఆలిండియా టాపర్లు.. నిఖిల్ రెడ్డి, ఐశ్వర్యారెడ్డి నేపథ్యమిదీ
ఐసీయూలో రహీంయార్ ఖాన్ ఎయిర్‌బేస్
‘‘భారత సేనలు చేసిన దాడి దెబ్బకు పాకిస్తాన్(India Vs Pakistan)లోని రహీంయార్ ఖాన్ ఎయిర్‌బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది. పాకిస్తాన్ అణుబెదిరింపులకు భారత్ ఇక భయపడదు. పాక్‌తో ఎలాంటి వాణిజ్యం కానీ, చర్చలు కానీ అస్సలు ఉండవు’’ అని మోడీ వెల్లడించారు. ‘‘పాకిస్తాన్‌తో చర్చలు అంటే కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనే జరుగుతాయి. భారత్‌లో ఉగ్రదాడులు జరిగితే, పాక్ ఆర్మీ, ఆర్థికవ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని భారత ప్రధాని హెచ్చరించారు.
Also Read :India Vs Pakistan : ట్రంప్ గాలితీసిన జైశంకర్.. అమెరికా మధ్యవర్తిత్వం అబద్ధమని వెల్లడి
భారత్ నీళ్లు ఇక పాక్‌కు చేరవు
‘‘భారత దేశానికి న్యాయంగా చెందాల్సిన నీరు ఇక పాక్‌కు ప్రవహించదు.. సింధూ నది నుంచి ఇక చుక్కనీరు కూడా పాకిస్తాన్ వైపు పారదు’’ అని మోడీ స్పష్టం చేశారు.ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్విస్తున్నారని చెప్పారు. కాగా, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునర్నిర్మించిన దేశ్‌నోక్ స్టేషన్‌ను మోడీ ప్రారంభించారు. బికనేర్-ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపారు. అనంతరం విద్యార్థులతో మోడీ ముచ్చటించారు. దేశ్‌నోక్‌లోని కర్ణిమాత ఆలయంలో పూజలు చేశారు.