HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Signs Mega Deal For 31 Predator Drones From Us

Predator Drones : భారత్-అమెరికా బిగ్ డీల్.. రూ.29వేల కోట్లతో 31 ‘ఎంక్యూ9బీ’ ప్రిడేటర్‌ డ్రోన్లు

ఈ డ్రోన్లను కూడా జనరల్‌ అటామిక్స్‌ సంస్థ నుంచి భారత్ లీజుపై(Predator Drones)  తీసుకుంది.

  • Author : Pasha Date : 15-10-2024 - 2:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
300-400 Drones
300-400 Drones

Predator Drones : అమెరికా నుంచి 31 ‘ఎంక్యూ9బీ సాయుధ ప్రిడేటర్‌’ డ్రోన్ల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.29వేల కోట్లు. ఈ ఒప్పందంపై భారత్, అమెరికాలు సంతకాలు చేశాయి.  మొత్తం 31 ఎంక్యూ9బీ డ్రోన్లలో 15 భారత నౌకాదళానికి, 8 భారత సైన్యానికి అందుతాయి. మరో 8 డ్రోన్లను భారత వాయుసేనకు కేటాయిస్తారు. నాలుగు హెల్‌ఫైర్‌ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లే కెపాసిటీ ఎంక్యూ9బీ డ్రోన్ల సొంతం.

Also Read :600 Bank Jobs : 600 బ్యాంకు జాబ్స్.. ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక

ఈ డ్రోన్లలో వినియోగించే మిస్సైళ్లు, లేజర్‌ గైడెడ్‌ బాంబులను జనరల్‌ అటామిక్స్‌ సంస్థ సమకూరుస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఎంక్యూ9బీ డ్రోన్ల పనితీరును స్వయంగా రాజ్‌నాథ్ పరిశీలించారు. ఎక్కువ ఎత్తులో.. దాదాపు 40 గంటలకుపైగా గాల్లో ఎగరడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. మన దేశం ఇప్పటికే సీగార్డియన్‌ డ్రోన్లను వాడుతోంది.  ఈ డ్రోన్లను కూడా జనరల్‌ అటామిక్స్‌ సంస్థ నుంచి భారత్ లీజుపై(Predator Drones)  తీసుకుంది.ఈ ఏడాది జనవరిలోనే వీటి లీజు గడువు ముగిసింది. దీంతో సీగార్డియన్‌ డ్రోన్ల లీజు కాంట్రాక్టును మరో నాలుగేళ్లపాటు పొడిగించారు.

Also Read :Supreme Court : కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

పదేపదే కూల్చేసిన యెమన్ హౌతీలు

చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణ పొందేందుకు ‘ఎంక్యూ9బీ సాయుధ ప్రిడేటర్‌’ డ్రోన్లను భారత్ కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి ఈ డ్రోన్లను కూడా కూల్చేయొచ్చని ఇటీవలే పలుమార్లు యెమన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు నిరూపించారు. గత కొన్ని నెలల వ్యవధిలో యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లపై దాడుల కోసం అమెరికా నౌకాదళం ఈ డ్రోన్లను వాడింది. ఎర్ర సముద్రంలో హౌతీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఎంక్యూ9బీ సాయుధ ప్రిడేటర్‌’ డ్రోన్లను అమెరికా మోహరించింది. అయితే చాలాసార్లు హౌతీలు వాటిని విజయవంతంగా కూల్చేశారు. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలే అందుకు నిదర్శనం.  అమెరికా రక్షణశాఖ అధికారులు సైతం ఈ ఘటనలను నిర్ధారించారు. ఇంత కాస్ట్లీ డ్రోన్లను యెమన్ హౌతీలు అవలీలగా కూల్చేయడంపై అంతటా చర్చ నడిచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Indian Navy
  • Predator Drones
  • Sky Guardian
  • United States
  • us

Related News

LPG Price

LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందో తెలుసా?!

భారతదేశం తన LPG అవసరాలలో దాదాపు 60 శాతం దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల దేశంలో LPG ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో దాని ధరలతో ముడిపడి ఉంటాయి.

  • President Trump

    President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

  • Benz Cars Price Hike

    Benz Cars Price Hike : భారీగా పెరగనున్న బెంజ్ కార్ల ధరలు

  • Lokesh Foreign Tour

    Lokesh Foreign Tour : CIBC ప్రెసిడెంట్ తో నారా లోకేశ్ భేటీ

Latest News

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

Trending News

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd