India Pak Ceasefire : తక్షణ కాల్పుల విరమణకు భారత్ – పాక్ ఓకే.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్ట్‌ను అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్(India Pak Ceasefire) షేర్ చేశారు.
- By Pasha Published Date - 05:53 PM, Sat - 10 May 25

India Pak Ceasefire : భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రరూపు దాలుస్తున్న వేళ అగ్రరాజ్యం అమెరికా శనివారం కీలక ప్రకటన చేసింది. భారత్, పాక్‌లు పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాలకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ఆయన వెల్లడించారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్‌సోషల్’ వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
Also Read :Pak Nuclear Bombs: అణుబాంబుల విభాగంతో పాక్ ప్రధాని భేటీ.. ఎందుకు ?
ట్రంప్ ఏం చెప్పారంటే..
‘‘గత మూడు రోజులుగా భారత్, పాకిస్తాన్ యుద్ధం జరుగుతోంది. ఇరుదేశాలు భీకరంగా పరస్పర దాడులకు పాల్పడుతున్నాయి. మేం తటస్థంగా వ్యవహరించి ఇరుదేశాలతో సంప్రదింపులు జరిపాం. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటివరకు చర్చలు జరిపి వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చాం. ఎట్టకేలకు ఇరుదేశాలు పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇందుకు ఒప్పుకున్నందుకు ఇరుదేశాలకు అభినందనలు. కామన్ సెన్స్‌ను, గొప్ప మేధస్సును వాడుకొని ఇరుదేశాలు కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి’’ అని ‘ట్రూత్‌సోషల్’ వేదికగా తన పోస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Also Read :TPCC : టీపీసీసీ కార్యవర్గానికి ఎంపికయ్యేది ఎవరు ? క్లారిటీ అప్పుడే !
ట్రంప్ పోస్ట్‌ను షేర్ చేసిన జేడీ వాన్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్ట్‌ను అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్(India Pak Ceasefire) షేర్ చేశారు. అయితే కొన్ని రోజుల క్రితమే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం ఇతర దేశాల యుద్ధాల్లో తలదూర్చం. అది మా దేశం పని కాదు’’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం భారత్, పాక్‌ల యుద్ధం వ్యవహారంలో అమెరికా మధ్యవర్తిత్వంతో ముడిపడిన ట్రంప్ పోస్ట్‌ను జేడీ వాన్స్ షేర్ చేయాల్సి వచ్చింది.
పాకిస్తాన్ స్పందన ఇదీ..
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ సానుకూలంగా స్పందించారు. ‘‘మా ప్రభుత్వం శాంతిని, భద్రతను కోరుకుంటోంది’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘పాకిస్తాన్, భారత్‌లు పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు విరాజిల్లాలని మేం కోరుకుంటున్నాం. అయితే పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లితే ఊరుకోం’’ అని ఇషాక్ దర్ స్పష్టం చేశారు.