HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Achieves First Space Docking Becoming Fourth Country To Achieve Major Milestone

Space Docking : జయహో ఇస్రో.. జంట ఉపగ్రహాల స్పేస్ డాకింగ్‌ సక్సెస్‌

దీంతో ఈ ఘనతను సాధించిన నాలుగో దేశంగా భారత్(Space Docking) అవతరించింది.

  • By Pasha Published Date - 11:04 AM, Thu - 16 January 25
  • daily-hunt
Space Docking Isro India 2025

Space Docking : భారతీయులంతా గర్వించదగిన మరో అపూర్వ విజయాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించి పెట్టింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా ఇస్రో ఇటీవలే నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. దీంతో ఈ ఘనతను సాధించిన నాలుగో దేశంగా భారత్(Space Docking) అవతరించింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను ఈవిధంగా అనుసంధానం చేయగలిగాయి. ఈవివరాలను ఎక్స్ వేదికగా ఇస్రో (ISRO) వెల్లడించింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడం కోసం శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్‌ భారతీయులకు అభినందనలు తెలిపింది.

Also Read :Jobs In DCCBs  : ఏపీలోని డీసీసీబీ బ్యాంకుల్లో 251 జాబ్స్.. అప్లై చేసుకోండి

స్పేస్ డాకింగ్ సక్సెస్ ఇలా.. 

  • 2024 సంవత్సరం డిసెంబరు 30న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో సతీశ్‌ ధావన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌) ఉంది. దాని నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ60 (పీఎస్‌ఎల్‌వీ) అనే రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ప్రయోగించింది.
  • ఈ రాకెట్ బయలుదేరిన 15.09 నిమిషాల తర్వాత.. దానిలోని రెండు శాటిలైట్లు విడిపోయాయి.
  • అంతరిక్షంలో ఈ రెండు ఉపగ్రహాలు చక్కర్లు కొడుతుండగా.. వాటి వేగాన్ని ఇస్రో నియంత్రణలోకి తెచ్చుకుంది.  మూడుసార్లు స్పేస్ డాకింగ్‌ (Docking) కోసం యత్నించింది. అయితే అది సాధ్యపడలేదు. దీంతో స్పేస్ డాకింగ్ ప్రక్రియను వాయిదా వేశారు.
  • ఎట్టకేలకు గురువారం రోజు ఈ రెండు ఉపగ్రహాలను డాకింగ్ చేసే ప్రక్రియ విజయవంతం అయింది.  రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు.
  • 3 మీటర్ల దూరంలో ఈ రెండు శాటిలైట్లను నిలకడగా నిలబెట్టి..  వాటి మధ్య స్పేస్ డాకింగ్‌ (Docking)ను చేయించారు. ఈ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది.
  • అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ దూసుకుపోతోంది. 2023 సంవత్సరంలోనూ భారత్ ఒక గొప్ప విజయాన్ని సాధించింది. అప్పట్లో చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలంపై స్పేస్ క్రాఫ్ట్ (వ్యోమనౌక)ను ఇస్రో విజయవంతంగా ల్యాండ్ చేయించింది. దాని ద్వారా చంద్రుడి ఉపరితలంపై భారత్ ముమ్మర అధ్యయనం చేసింది.

Also Read :Sankranti Cockfights : 3 రోజుల్లో రూ.1,500 కోట్ల కోడిపందేలు.. ఎంతోమంది ‘నష్ట’కష్టాలు

భారత్ ఫ్యూచర్ ప్లాన్ ఇదీ..

  • 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడి ఉపరితలంపైకి పంపాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది.
  • రాబోయే కొన్నేళ్లలో వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపాలని భారత్ భావిస్తోంది.
  • 2035 నాటికి సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్లాన్‌తో భారత్ ఉంది.
  • వీనస్‌ గ్రహంపై అధ్యయనం కోసం 2028లో భారత్ ప్రత్యేక మిషన్‌ను చేపట్టబోతోంది.
  • చంద్రుడి ఉపరితలంపై  భారత ల్యాండర్, రోవర్లు సేకరించిన శాంపిళ్లను భూమికి తీసుకొచ్చే  ప్రక్రియ కోసం 2027లో మరో చంద్రయాన్ మిషన్‌ను చేపట్టనున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • isro
  • space
  • Space Docking
  • Unmanned Docking

Related News

Vande Mataram

Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రభుత్వం నాలుగు దశల్లో ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 7, 2025న ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం జరగనుంది.

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

  • Satellite CMS

    Satellite CMS: అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్‌డౌన్!

  • Isro Baahubali New

    Isro : మరో భారీ ప్రయోగానికి ఇస్రో సిద్ధం

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd